- సమస్యలు విన్నవించేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు
- ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్
- విజ్ఞప్తులు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ
విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ నగరానికి వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్..వారి వినతులను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.వాడబలిజ మత్స్సకారులకు ఆసరాగా నిలవండి
ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని వాడబలిజ మత్స్యకారులమైన తాము అరకొర సంపాదనతో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని తమకు బోట్లు, వలలు అందించడంతో పాటు మా ప్రాంతాల్లో పాఠశాలలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఉత్తరాంధ్ర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన తనకు ఉద్యోగం కల్పించడంతో పాటు నివాస స్థలం మంజూరు చేయాలని విశాఖ మిండి ప్రాంతానికి చెందిన దాడి అవినాష్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తన తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందారని, ఎలాంటి ఆధారం లేని తనను ఆదుకోవాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర పోలీసు వారి నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక నవరాత్రుల ఉత్సవాలలో ఊరేగింపు కార్యక్రమంలో సౌండ్ సిస్టమ్స్ ను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 5వేల కుటుంబాలు ఉత్సవాలపై ఆధారపడి ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సర్వస్వం కోల్పోయిన తమకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన గుడాల జీవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గత నెల 11వ తేదీన విశాఖపట్నం వెళ్తుండగా తాము ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడంతో తాను, తన సతీమణి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డామని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ కుమారుడు మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.డిగ్రీ చదివిన తమ దివ్యాంగ కుమార్తెకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విశాఖపట్నం 91వ వార్డుకు చెందిన పి.ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.విశాఖ భీమిలి మండలం లక్ష్మీపురంలో ఉన్న తన స్థలంలో నూతన ఇల్లు నిర్మించుకునేందుకు కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ అడ్డుగా ఉందని, సదరు ట్రాన్స్ ఫార్మర్ ను తొలగించి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలోకి మార్పించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కె.సత్తిబాబు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Authored by: Vaddadi udayakumar