న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా అర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన లోకేష్.ఎపిలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తిచేశారు. అదేవిధంగా కేంద్ర విదేశీయాన శాఖ మంత్రి జై శంకర్ తదితర కేంద్ర మంత్రులను కూడా లోకేష్ కలిసి చర్చించారు.
Authored by: Vaddadi udayakumar