విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రథమ స్థానం ఉపాధ్యాయులదేనని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు.సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా భీమిలి జీవీఎంసీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాదాబత్తుల తిరుమల శ్రీదేవికి ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్న సందర్భంగా ఆమెను కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు మంచి పౌరులుగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. అలాగే భీమిలి జీవీఎంసీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కాబడి ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందుకోవడంతో విశాఖ నగరానికి ఎంతో పేరు ప్రతిష్టలు దక్కాయని అందుకు ఆమెను అభినందించడం జరిగిందన్నారు.అలాగే పాఠశాల అభివృద్ధికి ,విద్యార్థులు ఉన్నతికి నిరంతరం కృషి చేయాలని కమీషనర్ ఆమెకు సూచించారు.
Authored by: Vaddadi udayakumar