హాస్పటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ వెల్లడి
హైదరాబాద్,ఐఏషియ జ్యోతిన్యూస్: అమరావతిలో ఈ నెల 13న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, ప్రముఖ సినిమా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. అనంతవరం, తుళ్లూరు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన 21 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించనున్నారు.అమరావతిలో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిని దేశంలో ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని బాలకృష్ణ తెలిపారు.మూడు దశల్లో అమరావతిలో ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
Authored by: Vaddadi udayakumar