- తెలుగువారికి పెన్షన్ పరిచయం చేసింది ఎన్టీఆర్
- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు ప్రజలకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియచేశారు. రాజంపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా 30 రూపాయలతో 1983లో ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని పెట్టారన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అందిస్తుందని, అలాగే దివ్యాంగులకు . 6 వేలు, 10 వేలు, 15 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు.దివ్యాంగులకు 12 రెట్లు పెన్షన్ పెంచింది టీడీపీనే అన్నారు.దివ్యాంగులు కాని వారికి కూడా వైసీపీ కార్యకర్తలకు గత ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చిందని ఆరోపించారు.అర్హులకు పెన్షన్ ఇవ్వాలి. ప్రభుత్వ సంపద పేదలకే పంచి పెట్టాలి.చెడును చెడుగా.. మంచిని మంచిగా చెప్పడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి.30 ఏళ్లలో ఒక్కనాడైనా విరామం తీసుకున్నానా? ఒక్కరోజైనా అలసిపోయినట్టు కన్పించానా? అని ప్రజలను ప్రశ్నించారు.పేదల కోసం నిత్యం పని చేయాలి,సంక్షేమం అందించాలి.అందరి భవిష్యత్ బాగుండాలనే నిరంతరం నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటానని చెప్పారు. ప్రభు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి పథకాలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.రాజంపేట నియోజకవర్గం, బోయనపల్లిలో యడవల్లి సుమిత్రమ్మ ఇంటికి వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆమెకు పింఛను అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో దోభీ ఘాట్‌ను సీఎం పరిశీలించి, రజకులతో మాట్లాడి కష్ట నష్టాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ శాఖ అందిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar