భీమునిపట్నం,ఐఏషియ న్యూస్: భీమునిపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం రఘు ఇంజనీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అదిక సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు 498 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో రఘు విద్యాసంస్థల చైర్మన్ రఘు కలిదిండి కరస్పాండెంట్ రమాదేవి ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ జగదీష్ డీన్ డాక్టర్ సతీష్ చౌదరి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ కృష్ణ కిషోర్ బి ఎస్ వెంకట్ రెడ్డి విభాగాదిపతులు విద్యార్థులు పాల్గొన్నారు రక్తదాతలకు చైర్మన్ రఘు కలిదిండి మెమొంటోలు ప్రశంసపత్రాలు అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ కే దివ్య వర్షిని ఎం.రాముల పర్యవేక్షణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
Authored by: Vaddadi udayakumar