పూణే,ఐఏషియ న్యూస్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు తెరతీశారు.పూణేలోని స్పెషల్ కోర్టుకు హాజరైన సందర్భంగా తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. తన ప్రాణాలకు హాని ఉందని రక్షించాలని కోర్టును తెలిపారు. గతంలో తాను వీర్ సావర్కర్‌పై చేసిన ప్రకటన సందర్భంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలపై ఇద్దరు నేతలు బెదిరించినట్లు వివరించారు. తాజాగా పూణే ప్రత్యేక కోర్టుకు హాజరైన సమయంలో తనకు మరింత భద్రత కల్పించాలని కోరారు.
Authored by: Vaddadi udayakumar