- రక్తదానానికి ముందడుగు వేసిన విద్యార్థులు
- డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయభారతి
చింతపల్లి,ఐఏషియ న్యూస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా మెగా రక్తదాన శిబిరంలో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థినీ ,విద్యార్థులు మరియు అధ్యాపకులు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 54 మంది రక్త దానము చేశారు. దీనికి సంబంధించి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అయిన జిల్లాకలెక్టర్, జిల్లా మెడికల్ ఆఫీసర్ సంతకంతో, రెడ్ క్రాస్ నోడల్ అధికారి సంతకంతో కూడిన సర్టిఫికెట్స్ ను సోమవారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఎం విజయ భారతి విద్యార్థులకు సర్టిఫికెట్స్ ని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రక్తదానం యొక్క గొప్పతనాన్ని ఆరోగ్యమైనటువంటి విద్యార్థిని విద్యార్థులు రక్తదానం చేయవలసిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్రీనివాసపాత్రుడు, డాక్టర్ డి.కేజియా,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు,అధ్యాపకులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar