పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పీవీఎన్ మాధవ్
విశాఖపట్నం,,ఐఏషియ న్యూస్: నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది మళ్ల తుల సీరాం శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ సందర్భంగా మళ్ల తులసీరామ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకుని, బీజేపీ పథకాలు, పరిపాలన పట్ల ఆకర్షితుడైనయ్యానని ఈ సందర్భంగా మళ్ల తులసీరాం తెలియజేశారు. తులసీరాం 1999 నుంచి 2008 నుంచి ఎన్ఎస్ యూఐలో పని చేశారు. ఆ సంఘం విశాఖ నగరాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఉన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరో నాలుగుగేళ్లు పని చేశారు. పీసీసీ లీగల్ సెల్ సభ్యుడిగా 2015 నుంచి 2017 వరకు బాధ్యతలు నిర్వహించారు. అనంతరం వైసీపీలో చేరి ఆ పార్టీ లీగల్ సెల్ సభ్యుడిగా కూడా పని చేశారు. విద్యార్థి సంఘ నాయక పడిగా, యువజన సంఘం నేతగా మళ్ల తులసీరాం చాన్నాళ్లు పని చేసి అందరి మన్ననలు పొందారు. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ (ఎమ్మెస్సీ) గా బాధ్యతలు తీసుకుని అనేక కేసులను పరిష్కరించారు. విశాఖ నగరంలో ప్రముఖ న్యాయవాదిగా పేరొందారు. బీజేపీలో చేరిన సందర్భంగా మోదీ, అమిత్, రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ కుమార్, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు తదితరులకు మళ్ల తులసీరాం కృతజ్ఞతలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar