విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విధుల నిర్వహణ నిమిత్తం విశాఖకు వచ్చిన సౌత్ ఆఫ్రికాకు చెందిన నేవీ అధికారి.ఐ ఎన్ ఎస్ శాతవాహనకు వచ్చి పాస్ పోర్ట్ ను పోగొట్టుకున్న పోజెఫ్ జాన్సన్ వాన్ రెన్స్ బర్గ్.నేరుగా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన నేవీ అధికారి.సిపి శంఖ బ్రత బాగ్చి అదేశాలతో విచారణ చేసిన గాజువాక పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీసులు పాస్ పోర్ట్ ను గుర్తించి తక్షణమే సిపి చేతుల మీదుగా పాస్పోర్టును సౌత్ ఆఫ్రికా నేవి అధికారికి అందజేయడం జరిగింది.విశాఖ సిపికి సౌత్ ఆఫ్రికాకు చెందిన నేవీ అధికారి కృతజ్ఞతలు తెలియజేశారు. సకాలంలో స్పందించి పాస్ పోర్ట్ ను నేవీ అధికారికి అందజేయడంలో కీలకపాత్ర పోషించిన గాజువాక పోలీసులను సిపి అభినందించారు.
Authored by: Vaddadi udayakumar