సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
దత్తిరాజేరు(విజయనగరం),ఐఏషియ న్యూస్: రాష్ట్రముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పలువురు మంత్రులు మంగళవారం పరిశీలించారు.దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సిఎం చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు నిర్వహిస్తున్న ఏర్పాట్లను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత,రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమశాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి,ఎస్‌పి ఏఆర్ దామోదర్, జెసి ఎస్.సేతు మాధవన్‌తో కలిసి సిఎం పాల్గొనే వేదికలను పరిశీలించారు.అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, బొబ్బిలి ఎంఎల్ఏ బేబీ నాయన, డిసిసిబి ఛైర్మన్ కిమిడి నాగార్జున,మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్ రోజంతా దత్తిగ్రామంలోనే ఉండి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
ప్రజాసమస్యలు పరిష్కారమే లక్ష్యం మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రతీనెలా ఒకజిల్లాలో పర్యటిస్తున్నారని,రాష్ట్ర సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.సిఎం సభావేదిక వద్ద ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్‌టిఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేయడానికి సిఎం ప్రతీనెలా ఏదో ఒక జిల్లాకు వెళ్తూ, అక్కడి ప్రజలతో మమేకమై,వారిసమస్యలనునేరుగాతెలుసుకుంటున్నారని చెప్పారు. తద్వారా పాలనాపరంగా పలు విధాన నిర్ణయాలను తీసుకునేందుకు ఈ పర్యటనలు దోహదం చేస్తున్నాయని తెలిపారు. సిఎం హోదాలో మొదటిసారిగా తమ నియోజకవర్గానికి వస్తున్నందుకు,మారుమూల గ్రామమైన దత్తిని తమ పర్యటనకు ఎంపిక చేసుకున్నందుకు ఈ సందర్భంగా సిఎంకు మంత్రి కొండపల్లి కృతజ్ఞతలు తెలిపారు.
ఏర్పాట్లు సమీక్షించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను జిల్లాకలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సమీక్షించారు.ఆయన దత్తి గ్రామంలోని అన్ని వేదికలను స్వయంగా పరిశీలించారు. గ్రామ సచివాలయంలో కూర్చొని అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎస్‌పి ఏఆర్ దామోదర్, జెసి సేధుమాధవన్,ఇతర ఉన్నతాధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఎవరికి అప్పగించిన విధులను వారు పకడ్బంధీగా నిర్వర్తించి, పరస్పరం సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయడం ద్వారా సిఎం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Authored by: Vaddadi udayakumar