వేదికపై కానిస్టేబుల్ కోరిన వెంటనే రోడ్డు మంజూరు

మంగళగిరి,ఐఏషియ న్యూస్: కానిస్టేబుల్ నియామక కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ లకే బాబూరావు తన స్వగ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి అధికారులు ఆదేశించారు.ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు త్వరగా అంచనాలు సిద్ధం చేయగా రూ. 2 కోట్లతో రోడ్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ పరిపాలనా అనుమతులు కూడాఇచ్చారు.సభముగిసేలోగారోడ్డుమంజూరుఅయింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు.అల్లూరి జిల్లాజికేవీధిమండలంతెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి అధికారులు అన్ని అనుమతులు మంజూరు చేశారు.త్వరలోనే ఈ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం జరిగే అవకాశాలు ఉన్నాయి. తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు కావాలని కోరిన కానిస్టేబుల్ లకే బాబురావును అభినందించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *