విశాఖపట్నం,ఐఏషియన్ న్యూస్: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎన్.ఎస్ రాజా సుబ్రమణి మంగళవారం ఉదయం సందర్శించారు. ఆయనకు ఏ యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు స్వాగతం పలకగా అనంతరం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తో కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వీరు పలు అంశాలపై చర్చించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధిని ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ తెలియజేశారు. త్రివిధ దళాల ఉద్యోగులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నిరంతరం సేవలు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ తెలియజేశారు.విశ్వవిద్యాలయంలోని మానవ వనరులను సైనిక ఉద్యోగుల అభివృద్ధికి, వారిలో విభిన్న నైపుణ్యాలను పెంపొందించడానికి వినియోగిస్తామని తెలియజేశారు. సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ తో త్రివిధ దళాలకు ఉన్న అనుభదాన్ని మరింత బలోపేతం చేస్తామని త్రివిధ దళాలలో పనిచేస్తున్న సైనిక ఉద్యోగులకు అవసరమైన విభిన్న కోర్సులను ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో అందిస్తుందని ఆచార్య రాజశేఖర్ వివరించారు.
Check Also
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష మందికి వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ
హైదరాబాద్,ఐఏషియ న్యూస్బ్యూరో: హైదరాబాద్ నగరం ఎప్పుడూ పండుగల రంగుల హరివిల్లులా ఉంటుంది. ఏ పండుగ వచ్చినా అది పెద్దగా హడావుడి …