అమరావతి,ఐఏషియ న్యూస్: నరసరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సోమవారం సచివాలయంలో కలిసి రూ.2,00,116 చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, టిడిపి నేతలు ఉన్నారు.
Authored by: Vaddadi udayakumar