తిరుమల అన్నప్రసాద భవనాన్ని తనిఖీ చేసిన టిటిడి ఈవో శ్యామలరావు

తిరుమల,ఐఏషియన్యూస్: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టిటిడి భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల నాణ్యత,రుచిని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి సోమవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఈవో టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.భక్తులు టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.అంతకుముందు ఈవో,అదనపు ఈవోతో కలసి అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు.తరువాత కియోస్క్ మిషన్ ద్వారా ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విరాళం అందించారు.అనంతరం ఈవో అన్నప్రసాద భవనంలోని క్యూలైన్లు, పరిశుభ్రత,ముడి సరుకుల నిల్వగది తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవో గ్యాస్ ప్లాంట్ ను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

వైకుంఠ ద్వార దర్శనానికి 7,70,000 టోకెన్ల జారీ

నిర్ణీత సమయానికి లైన్లో చేరుకుంటే రెండు గంటల్లోనే దర్శనం టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటన తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమలలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *