హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై కన్నేసిన ట్రంప్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ గత దశాబ్ద కాలంగా భారత్ ను అతిపెద్ద మార్కెట్‌గా పరిగణిస్తోంది. ట్రంప్ ఆర్గనైజేషన్ పలు ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముంబై, పూణే, కోల్‌కతా, గురుగ్రామ్‌లలో ఏడు ప్రాజెక్టుల ద్వారా కనీసం గత ఆర్థిక సంవత్సరంలో 175 కోట్ల రూపాయలను ఆర్జించింది.ఈ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించుకుంటోంది ట్రంప్ ఆర్గనైజేషన్.2024 నవంబర్ 5న ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే- తన భారత వ్యాపార భాగస్వామి ట్రైబెకా డెవలపర్‌తో కలిసి గురుగ్రామ్, పూణే, హైదరాబాద్, ముంబై, నోయిడా, బెంగళూరులో ఆరు కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది.. ట్రంప్ ఆర్గనైజేషన్.ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరగనుంది.దీని ద్వారా ఆ సంస్థ ఎంత ఆదాయాన్ని పొందుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ సంవత్సరంలో పూణే, గుర్గావ్,హైదరాబాద్‌లలో మొత్తం 4.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి.ఇది ట్రంప్ ఆర్గనైజేషన్ నిర్దేశించుకున్న టార్గెట్ లో సగానికి పైమాటే.

2012లో భారత్ లో అడుగు పెట్టిందీ సంస్థ. అప్పటి నుండి.. మొత్తం 11 మిలియన్ చదరపు అడుగుల మేర రియల్ ఎస్టేట్ నిర్మాణాలను పూర్తి చేసుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం నాటికి అభివృద్ధి చేసిన మూడు మిలియన్ చదరపు అడుగులతో పోల్చుకుంటే నాలుగు రెట్లు ఎక్కువ. రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే.. ట్రంప్ ఆర్గనైజేషన్ కార్యకలాపాలు వేగం పుంజుకొన్నాయి.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 68వ రోజు ప్రజాదర్బార్

సమస్యలు విన్నవించేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ విజ్ఞప్తులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *