బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ప్రముఖప్రైవేటురంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు. ఇటీవల బ్యాంక్ ఖాతాలో రూ.50వేల కనీసం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను వెనక్కి తీసుకుంది. ఈ కనీస నిల్వ నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో బ్యాంక్ తన నిర్ణయం మార్చుకుంది. ఈ మేరకు కనీస సగట బ్యాలెన్స్ మొత్తాలను సవరిస్తూ ప్రకటన జారీ చేసింది. మెట్రో/ అర్బ ఖాతాదారులు రూ.15,000 నెలవారీ సగటు బ్యాలెన్స్ కలిగి ఉండాలని, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే రూ.7,500 ఉండాలన్న నిబంధన విధించింది. అలాగే గ్రామీణ ఖాతాదారులకు మాత్రం ఎప్పటిలానే రూ.2,500 సగటు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచితే సరిపోతుందని బ్యాంకు పేర్కొంది. ఐసిఐసిఐ బ్యాంక్ మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదార్లు కనీస నిల్వ పరిమితినిరూ.50 వేలకు పెంచేసింది.గతంలో ఈ మొత్తం రూ.10 వేలుగా ఉండేది. సెమీ అర్బన్ ఖాతాదార్ల కనీస నిల్వ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. గ్రామీణ ఖాతాదార్లకు రూ.2,500 నుంచి రూ.10 వేలకు సవరించింది. దీనిపై ఆర్బిఐ జోక్యం చేసుకోనప్పటికీ ఖాతాదారుల నుంచి మాత్రం పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.దీంతో ఈ మొత్తాలను స్వల్పంగా సవరిస్తూ ఐసిఐసిఐ బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకుంది.
Authored by: Vaddadi udayakumar