విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు భోజనం చేయాలి

  • ఫుడ్ పాయిజన్ జరిగే సంఘటనలు తగ్గుతాయి
  • తెలంగాణ హైకోర్టు సీజే అపరేశ్‌కుమార్‌ సింగ్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగాప్రభుత్వపాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఇలా చేస్తే ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు తగ్గిపోతాయి, నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని అభిప్రాయపడింది.స్కూల్ భోజన నాణ్యతపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది.విద్యార్థులు పాఠశాల పనుల్లో భాగస్వాములు కావడం తప్పుకాదని సీజే వ్యాఖ్య.తాను కూడా చిన్నప్పుడు స్కూల్ పనులు చేశానని సీజే అపరేశ్‌కుమార్‌ సింగ్ గుర్తుచేసుకున్నారు.ప్రభుత్వంపై పిటిషనర్ వాదన ఈ విధంగా ఉంది.చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు, కలుషితాహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు.
ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో ఎవరూ మరణించలేదు, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం అని సమాధానం చెప్పడం జరిగింది.రాష్ట్రంలో 3 లక్షలకు పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, టిఫిన్ అందజేస్తున్నామని న్యాయమూర్తికి ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చారు.ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఏళ్ల తరబడి విధులకు డుమ్మా కొట్టిన 62 మంది వైద్యులకు షోకాజు నోటీసులు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలని అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. వైద్యఆరోగ్య రంగానికి పెద్దపీట …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *