నేడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: భారత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాం గం పౌరులు పాలకులు, పాలన యంత్రాంగం, పాటించవలసిన అత్యున్నత చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఇందులో ప్రభుత్వ విభాగాలు వాటి స్వరూపం స్వభావం లక్ష్యాలు ఆశయాలు వివరించారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛకు సర్వతో ముఖాభి వృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తుంది.భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న ఇండియా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవం గా కూడా జరుపుకుంటారు.1949 నవంబర్ 26న భారత దేశం.రాజ్యాంగాన్ని దత్తత చేసుకుంది. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.అయితే ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని మాత్రమే దేశ ప్రజలు ఎక్కు వగా జరుపుకుంటున్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం కొత్తది కావడంతో దీనికి అంతగా ప్రాచుర్యం కలగలేదు.2015 నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 11న ముంబైలో సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేస్తూ ఈ ప్రకటన చేశారు. 2021లోఅంబేద్కర్‌ 131వ జయంతి జరిగింది. భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది వరకు నవంబర్ 26న లా డే గా జరుపుకునేవారు. నవంబర్ 26న… రాజ్యాంగం ప్రాధాన్యం, అంబేద్కర్ ఆశయాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 2015 నుంచే ఎందుకు?2015లో భారత రాజ్యాంగ పితగా పిలుచుకునే డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 125వ జయంతి జరిగింది. 2015 అక్టోబర్‌లో ముంబైలోని… అంబేద్కర్ జ్ఞాపిక దగ్గర… పునాది రాయి వేస్తూ… ప్రధాన మంత్రి నరేంద్రమోదీ… రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారు. అలా 2015 నుంచి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుగుతోంది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

One month to go for 12th International Day of Yoga

As part of the series of events leading up to the 12th International Day of …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *