ఆదిలాబాద్ కు ఏడాదిలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ

ఆదిలాబాద్,ఐఏషియ న్యూస్: ప్రజలను పట్టి పీడించిన పాత ప్రభుత్వాన్ని ఓడించి . ప్రజలు తమకు అండగా నిలబడి ప్రజా పాలన తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంను రెండు కళ్లుగా భావించి నాలుగు కోట్ల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.కాగాప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ఆదిలాబాద్ పట్టణంలో పర్యటించారు. పట్టణ అభివృద్ధికి, మహిళా సంక్షేమం, విద్యా, భద్రతా రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.260.45 కోట్ల నిధులను కేటాయించారు.ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, ముగిశాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందించడమే లక్ష్యం” అని స్పష్టం చేశారు. తాను చిన్న వయసులోనే జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, ఈ రెండేళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల గౌరవ మర్యాదలు పొందడం కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు.గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులను ముఖ్యమంత్రి సభలో పాల్గొనే అవకాశం ఇవ్వలేదని, సెక్రటేరియట్‌కు వెళ్తే తనను, సీతక్కను నిర్బంధించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. “సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలి” అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నామని, స్థానిక బీజేపీ నాయకులైన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడెం నగేష్‌లను కూడా అభివృద్ధి పంథా వైపు కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎయిర్‌పోర్ట్ కోసం భూమి ఇస్తే కేంద్ర మంత్రులు సహకరిస్తారని.. ప్రధాని మోదీ నిధులు ఇస్తామని హామీఇచ్చారన్నారు. ఏడాదిలో ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు,ఎయిర్ బస్సును తీసుకువస్తా అని హామీ ఇచ్చారు. పట్టణంలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్లలో అభివృద్ధి చేస్తానని, యూనివర్సిటీ ఏర్పాటు చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇంద్రవెల్లిలో కొమ్రం భీం పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీని తిరిగి తెరిపించడానికి ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పుట్టినరోజు ఆశీస్సులు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఉదయం సోషల్ మీడియాలో ఆశీస్సులు.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *