విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు హైదరాబాద్‌కు విమానం బల్దేరింది. కొంత దూరం వెళ్లాక విమానం రెక్కలో పక్షి ఇరుక్కుంది. దీంతో ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో మొత్తం 103 మంది ప్రయాణికులు ఉన్నారు.వీరి కోసం ఎయిరిండియా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
Authored by: Vaddadi udayakumar