డ్వాక్రా గ్రూప్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక జాబ్ మేళా

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్:  ఏపీలో డ్వాక్రా సంఘాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇప్పటికే రుణాలు, ఇతర సాయం చేస్తున్న ప్రభుత్వం తాజాగా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా కుటుంబాల్లో నిరుద్యోగుల యువత ఉంటే వారి కోసం ప్రత్యేకజాబ్,మేళాలునిర్వహించబోతోంది.పట్టణాల్లోని డ్వాక్రా కుటుంబాల్లో నిరుద్యోగ యువత కోసం జిల్లాల వారీగా 100 ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏడాది గడువు పెట్టుకుంది. ఈ ఏడాదిలోగా ప్రతీ జిల్లాలోనూ డ్వాక్రా కుటుంబాల్లోని నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు నిర్వహించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ జాబ్ మేళాలకు డ్వాక్రా కుటుంబాల్లోని నిరుద్యోగ యువత ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా వెల్లడించింది.
కొత్త జిల్లాల ప్రాతిపదికన ఒక్కో త్రైమాసికానికి ఒక్కొ జిల్లాలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. అంటే ఏడాదిలో జిల్లాలో నాలుగు జాబ్ మేళాలు నిర్వహిస్తారు. ఇలా ఏడాదిలో 100 జాబ్ మేళాలకు ప్లాన్ చేస్తున్నారు.ఇందుకోసం జాబ్ మేళాల నిర్వహణలో అనుభవం ఉన్న నిపుణ-హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీతో మెప్మా ఒప్పందం చేసుకుంటోంది.ఈ సంస్థ ఏడాదిలో 20 వేల ఉద్యోగాలను వీరికి కల్పించబోతోంది.జాబ్ మేళాల్లో టాటా ట్రెంట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, హెటేరో ఫార్మసీ, పేటియం, ఇండస్ బ్యాంక్, హెచ్ డీ బి ఫైనాన్షియల్ సర్వీస్, జస్ట్ డయల్, ముత్తూట్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, మెడ్ ప్లస్, హెచ్1 హెచ్ ఆర్ సొల్యూషన్స్, ఎంఆర్ఎఫ్, ప్రీమియర్ హెల్త్ కేర్ సర్వీసెస్, టాటా స్ట్రైవ్, ఇన్నోవ్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జీ4ఎస్ వంటి సంస్థలు పాల్గొని ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. డ్వాక్రా కుటుంబాల్లో సభ్యుల అర్హతల్ని బట్టి ఉద్యోగాలు కల్పిస్తారు. బుధవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్ లో లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు.ఉద్యోగాలు కోరుకునే డ్వాక్రా కుటుంబాల సభ్యులు https://jobmela.mepmaap.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులు అడిగిన అన్ని వివరాలను నింపి,కావాల్సిన కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బుధవారం శ్రీకాకుళంలో నిర్వహించే జాబ్ మేళాలో 20 కంపెనీలు పాల్గొంటున్నాయి. 500 ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇది పూర్తయ్యాక మిగతా జిల్లాల్లోనూ వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తారు. ఈ మేళాల వల్ల నిరుద్యోగ సమస్య దాదాపుగా తీరే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అమెరికాలో కాల్పులు: హైదరాబాదుకు చెందిన విద్యార్థి దుర్మరణం

డల్లాస్,ఐఏషియ న్యూస్: మెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. డల్లాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *