పెందుర్తి,ఐఏషియ న్యూస్: గుండెపోటుతో ఎస్.కోట ఏపీఎస్ఆర్టీ సీ డిపోకు చెందిన కండక్టర్ మంగళవారం మృతి చెందారు. ఎస్. కోట ఏపీఎస్ఆర్టీ డిపో సూపరిండెంట్ వెంకట్రావు తెలియజేసిన వివరాలు ప్రకారం విశాఖ నుంచి కించుమండ వెళుతున్న బస్సులో పెందుర్తి మండలం సరిపల్లి గ్రామ సమీపంలో కండక్టర్ ఈశ్వరరావు తాను కూర్చున్న సీటులోనే గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన ప్రయాణికులు,డ్రైవర్ కండక్టర్ ఈశ్వరరావును పెందుర్తి ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో విషాద ఛాయలు అలముకొన్నాయి.
Authored by: Vaddadi udayakumar