హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యారంగంపై దృష్టి సారించి పలు కీలక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ లాంటి అత్యంత కఠినమైన పోటీ పరీక్షలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. వాళ్లు మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున పంపిణీ చేసింది. ఈమేరకు చెక్కులను విడుదల చేసింది. దీనిలో భాగంగానే సివిల్స్-2025 …
Read More »Education
అల్లూరి జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి రూ.45.02 కోట్లు మంజూరు
మారుమూల గిరిజన స్కూళ్ల అభివృద్ధికి మంత్రి లోకేష్ చొరవ అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్ర విద్యారంగంలో దశాబ్ధాలుగా వేళ్లూనుకున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర విద్య,ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. విద్యా శాఖను సవాల్ గా స్వీకరించిన లోకేష్ గత ఏడాదికాలంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు అనునిత్యం పడుతున్న ఇబ్బందులను వివిధ ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న లోకేష్… వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి నడుంకట్టారు. గిరిజన ప్రాంతాలలో నూరుశాతం శాశ్వత …
Read More »దేశంలో అత్యంత సురక్షితమైన టాప్ టెన్ నగరాలు ఇవే
ఈ జాబితాలో హైదరాబాదుకు దక్కని చోటు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా సురక్షిత దేశాలు, నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ సంస్థ నంబియో సేఫ్టీ ఇండెక్స్ తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన సేఫ్టీ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో ప్రజల భద్రత, నేరాల తీవ్రత, మహిళలపై దాడుల రేటు,దొంగతనాలు,మాదకద్రవ్యాల వినియోగం తదితర అంశాలను ఆధారంగా తీసుకుంది. ఇక నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్ లో టాప్-10 సురక్షితమైన నగరాల జాబితాలో కర్ణాటకరాష్ట్రంలోని మంగళూరు తొలి స్థానాన్ని దక్కించుకుంది.అలాగే …
Read More »నేడు జాతీయ చేనేత దినోత్సవం
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: దారం పోగును వస్త్రంగా మలచి,మనిషి మానాన్ని కాపాడేది చేనేత. చేనేత వస్త్రం కేవలం ఒక వస్తువు కాదు, అది మన సంస్కృతికి, సంప్రదాయానికి, కళాత్మకతకు ప్రతీక. మన అస్థిత్వాన్ని, అసలైన గుర్తింపును చాటిచెప్పే చేనేత వస్త్రాలను ధరించడం మనందరి బాధ్యత.జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 7న జరుపుకుంటాము. 1905లో ఇదే రోజున స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. విదేశీ వస్తువులను బహిష్కరించి,స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఆనాడు పిలుపునిచ్చారు. ఈ స్ఫూర్తితోనే, మన చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడి జీవించే …
Read More »15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట వ్యాప్తంగా మహిళలు,ట్రాన్స్‌జెండర్లు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి 6వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర రాష్ట్ర రవాణా,యువజన,క్రీడా శాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి అమరావతి,ఐఏషియ న్యూస్: కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ నెల 15 న తేదీ నుండి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో …
Read More »సాహితీవేత్త దేవులపల్లి పద్మజకు ఘన సత్కారం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: శ్రీశ్రీ కళా వేదిక వారి 150వ కవి సమ్మేళనం విశాఖపట్నం రైల్వే ఫంక్షన్ హాలు శుభం వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ కవితలను వినిపించారు.విశాఖ నగరానికి చెందిన విద్యావేత్త, సాహితీవేత్త డాక్టర్ దేవులపల్లి పద్మజ, “ఉద్యమ జ్యోతి భారత కీర్తి పతాక అల్లూరి” శీర్షికతో స్వాతంత్ర్య పోరాట యోధుడైన అల్లూరి సీతారామరాజుపై కవిత వినిపించారు.వీరి కవితలు ఆహుతులను అలరించాయి.శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ , డాక్టర్ పార్థసారథి , శ్రీహరి …
Read More »కనీస పాస్ మార్కులను 35 నుంచి 33కు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం
బెంగళూరు,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం పదో తరగతి,ఇంటర్మీడియట్‌లో ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. అయితే, కర్ణాటక ప్రభుత్వం 35 మార్కుల పాస్ నిబంధనలను తాజాగా తొలగిస్తూ మార్పులు చేసింది.2025-26 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి,ఇంటర్ పరీక్షల మూల్యాంకన విధానంలో కొత్త నిబంధనలను అమలు చేయనుంది.ఈ ముసాయిదా నిబంధనల్లో రెండు కీలక సూచనలు ప్రకటించింది.ఒకటి పాస్ మార్కులను తగ్గించడం,రెండు అంతర్గత మూల్యాంకన (ప్రాక్టికల్స్) మార్కులను పాస్ మార్కులకు కలపడం. పదవ తరగతి పరీక్షలలో మొత్తం మార్కులలో కనీసం 33 …
Read More »ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్
విశాఖపట్నం,ఐఏషియన్ న్యూస్: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎన్.ఎస్ రాజా సుబ్రమణి మంగళవారం ఉదయం సందర్శించారు. ఆయనకు ఏ యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు స్వాగతం పలకగా అనంతరం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తో కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వీరు పలు అంశాలపై చర్చించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధిని ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ తెలియజేశారు. త్రివిధ దళాల ఉద్యోగులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నిరంతరం సేవలు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఈ …
Read More »