Education

ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు నేనే చెల్లిస్తా

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ టెన్త్ విద్యార్థులకు శుభవార్త హైదరాబాద్,ఐఏషియ న్యూస్: కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. విద్యార్థులపై తమకున్న అభిమానాన్ని బహిర్గతం చేశారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోగల ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ చెల్లించవలసిన పరీక్ష ఫీజును ఎస్ఎస్సీ బోర్డుకు తానే స్వయంగా కడతానని గురువారం ప్రకటించారు.ఈ మొత్తాన్ని తనకు వచ్చే ఎంపీ వేతనం …

Read More »

నేడు జవహర్లాల్ నెహ్రూ జయంతి

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: నవభారత నిర్మాతగా, స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రిగా అంతులేని కీర్తిని సంపాదించిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14. ఈ రోజున దేశంలోని చిన్నారులందరూ “బాలల దినోత్సవం”గా కన్నులపండువగా జరుపుకుంటారు. చాచాజీ జన్మదినం రోజునే బాలల పండుగను జరపటానికి కారణం. పిల్లలపట్ల ఆయనకు ఉన్న ప్రేమే.అందుకే “జాతి భవిష్యత్తు నాలుగ్గోడల మధ్యనే రూపుదిద్దుకుంటుంది కాబట్టి దేశంలోని బాలబాలికల అభివృద్ధికై తన పుట్టిన రోజును బాలల దినోత్సవం”గా జరుపుకోవాలని చాచాజీ ఆకాంక్షించారు.కాబట్టి చాచాజీ ఆశించినట్లుగా మన దేశంలో ప్రతి …

Read More »

3వ రోజుకు చేరిన “టిట్టిభ సత్యాగ్రహం”

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తెలుగుభాష రక్షణ కోసం తెలుగుదండు చేపట్టిన “టిట్టిభ సత్యాగ్రహం” మూడవ రోజు కూడా విజయవంతంగా జరిగింది. అనుకోని అతిథులుగా విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని నింపారు.దీక్షా వేదికపై తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ..ఓ పెద్దయ్యా పెద్దలు అంత పెద్దగా రావటంలేదని నువ్వంత పెద్దగా బెంగపడొద్దు. మేము లేమూ..మరిచిపోయారా? మన భాషను, మన సంస్కృతిని గట్టిగా కాపాడుకొందాం. మీరు అస్సలు తగ్గకండి అంటూ..మద్దతు పలికి, నాలో నమ్మకాన్ని నింపిన.. ఈ తెలుగు తల్లులకు కొద్దిగా సిగ్గుపడుతూ.కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ చమత్కరించారు.సత్యాగ్రహ …

Read More »

పింఛన్ మంజూరు చేసి ఆదుకోండి సారూ..

అరకులోయ,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని బి.బొడ్డపుట్టు పంచాయతీ పరిధి దబ్బాగరువు గ్రామానికి చెందిన విద్యార్థిని పాంగి దేవి తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటుంది.బి.బొడ్డపుట్టు ఎంపీపీ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నానని పుట్టుకతో దివ్యాంగురాలు.రెండు కాళ్లు రాక వీల్ చైర్లో తన సోదరుడు రోజు కిలోమీటర్ దూరంలోని పాఠశాలకు తీసుకువేళ్తారని చెప్పింది.పింఛన్ కోసం తమ తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరిగిన పింఛన్ నేటికీ మంజూరు కాలేదని,ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేసి తనను ఆదుకోవాలని …

Read More »

బాధ్యత మరిచిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సస్పెన్షన్

శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: ఆమె ఒక బాధ్యత గల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి బంగారు భవితను తీర్చిదిద్దాల్సిన వ్యక్తి. తరగతిలో పాఠాలు బోధించి విద్యార్థులలో జ్ఞానాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తరగతి గదిలో వారితో కాళ్లు పట్టించుకుంది ఆ ఉపాధ్యాయురాలు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో ఉన్న బందపల్లిబాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది.వై. సుజాత అనే మహిళ బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. …

Read More »

అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోకు ఆహ్వానించబడ్డ డాక్టర్ బారువా,డాక్టర్ పాణిగ్రాహి ముగిసిన ట్రాన్స్‌కాథెటర్ కార్డియోవాస్కులర్ థెరప్యూటిక్స్ (టిసిటి) సెమినార్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నంలోని హెల్త్ సిటీ, అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ క్యాథ్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ డి కె బారువ, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ ఎన్ కే పాణిగ్రాహి ఇటీవల ముగిసిన ట్రాన్స్‌కాథెటర్ కార్డియోవాస్కులర్ థెరప్యూటిక్స్ (టిసిటి), 2025లో అంతర్జాతీయ అధ్యాపకులుగా ఆహ్వానించబడ్డారు. అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ట్రాన్స్‌కాథెటర్ కార్డియోవాస్కులర్ థెరప్యూటిక్స్ (టిసిటి), 2025లో అంతర్జాతీయ అధ్యాపకుడిగా ఆహ్వానించబడ్డారు. డయాబెటిస్, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి పెరుగుతున్న ప్రాబల్యం, బెలూన్ యాంజియోప్లాస్టీ (పీటీసీఏ) ద్వారా సిసిఏడి చికిత్సలో ఎక్కువమంది వృద్ధ రోగులను …

Read More »

ఏపీఎస్పీ బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దత్తత తీసుకున్న ఎస్బిఐ

కాకినాడ రూరల్,ఐఏషియ న్యూస్: కాకినాడ రమణయ్యపేటలో గల మూడవ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దత్తత తీసుకోనునట్లు బ్యాంక్ రీజనల్ మేనేజర్ కృష్ణకుమార్ తెలిపారు.గురువారం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యక్షులు కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు స్కూలుకు కావలసిన కంప్యూటర్లు మౌలిక సదుపాయాలపై చర్చించారని ఉద్దేశంతో ఇప్పుడు 13 కంప్యూటర్లలో అందజేయడం జరిగిందని మరో 17 కంప్యూటర్లు అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా …

Read More »

జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: జాతీయ హైవేపై ఆయా రహదారుల సమాచారం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు తెలిపేలా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. ఈ క్యూఆర్ కోడ్‌లో సదరు రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారంతో పాటు నేషనల్ హైవే నంబర్, హైవే ఛైనేజ్, ప్రాజెక్ట్ పొడువు వివరాలను తెలియజేస్తాయి. ఇందులో హైవే గస్తీ, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజినీర్ల నంబర్లు, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1033, పెట్రోల్ బంక్, ఆస్పత్రుల వివరాలు ఉంటాయి. Authored by: Vaddadi udayakumar

Read More »

ఏపీ విద్యార్థుల కోసం 40 లక్షల నోటుబుక్స్,పెన్నులు

విరాళం ఇచ్చిన కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏపీ విద్యార్థుల కోసం హైదరాబాద్‌కు చెందిన కంపెనీ భారీ విరాళం ఇచ్చింది. ఏపీ విద్యార్థులకు అమలవుతున్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌ పథకానికి.. కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ విరాళం ఇచ్చింది. దాదాపు రూ.40 లక్షల రూపాయల విలువైన లక్ష నోట్‌ పుస్తకాలు, పెన్నులను అందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వీటిని పంచుతారు. విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ఈ పుస్తకాలు, పెన్‌లు ఉన్న ట్రక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ …

Read More »

డీఎస్సీ కి ఎంపికయిన గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీహరి

గుడివాడ,ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లాకి చెందిన బంకురు శ్రీహరి గత 5ఏళ్ళుగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ లో పని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో పట్టుదలతో చదువుకుని ఒక వైపు విధులు నిర్వహిస్తూ మరొక వైపు డీఎస్సీ కోసం కస్టపడి చదివి వచ్చిన ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఎస్ జి టి పోస్ట్ కు అర్హత సాధించటం జరిగింది. దీనిపై పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు..మరియు గుడివాడ తాలూకా ఎస్ఐ నంబూరి చంటి …

Read More »