Education

బియ్యం షాపులో పనిచేస్తూ టీచర్ అయ్యాడు

కుటుంబం మొత్తాన్ని కరోనా పొట్టనపెట్టుకుంది 44 ఏళ్లు వచ్చినా ఎవరూ పెళ్లిచేసుకోలేదు పగబట్టిన పేదరికంతో పోరాటం చేసాడు పట్టుబట్టి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు కంటతడి పెట్టించే రాంబాబు సక్సెస్ స్టోరీ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. పిల్లలను చదివించే స్థోమత లేదు.చందాలు పోగేసుకుని చదువు కన్నాడు. పేదరికం జయించడానికి ఉద్యోగం సాధించాలని నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ప్రతి డీఎస్సీ పరీక్షల్లోనూ ఏదో ప్రమాదం ముంచుకొచ్చేది. ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. కరోనా మహమ్మారి వచ్చి తండ్రిని, అక్కను, …

Read More »

టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె మౌనిక డీఎస్పీగా ఎంపిక

ములుగు,ఐఏషియ న్యూస్:  పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక నిరూపించారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు. తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ సాధించారు.ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీగా ఎంపికైన మౌనికను పలువురు అభినందించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

పనిచేయకపోతే తొలగిస్తాం: ఎఫ్ఆర్టీఐ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మట్ట ప్రసాద్

నరసరావుపేట,ఐఏషియ న్యూస్:  ఫోరమ్ ఫర్ ఆర్టీఐ లో పని చేయని వారిని పదవుల నుంచి తొలగిస్తామని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మట్ట ప్రసాద్ స్పష్టం చేశారు.జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ సూచనల మేరకు ఎఫ్ఆర్టీఐ పటిష్టతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛందంగా పని చేస్తామని పదవులు తీసుకొని పని చేయని వారు పదవులలో నుండి వైదొలగి కార్యకర్తగా కొనసాగవచ్చన్నారు.సీనియర్ నేత నెల్లూరుకు చెందిన రాష్ట్ర కమిటీ సభ్యులు కొల్లా శ్రీవాసరావు, బాపట్లకు చెందిన శామ్యూల్ జాన్సన్ నాయకత్వం నుంచి తప్పుకొని సాదారణ కార్యకర్తగా స్వచ్ఛందంగా …

Read More »

అంగన్వాడి,ఆశ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు: ప్రభుత్వం నిర్ణయం

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం అమ్మ ఒడికి అమలు చేసిన నిబంధనలతోనే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ పథకం అమలు చేసారు.ముందుగానే జాబితాలను ప్రకటించి అర్హత ఉండీ, రాని వారికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.కాగా ఇప్పుడు ఆశా వర్కర్లు, అంగన్ వాడీల్లో పని చేసే వారి కుటుంబాలకు ఈ పథకం అమలు చేసే ఆలోచన తో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలో తల్లికి …

Read More »

నేడు వైయస్సార్‌సీపీ ‘ఛలో మెడికల్‌ కాలేజీ’

పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం తాడేపల్లి,ఐఏషియ న్యూస్: తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్‌ కాలేజీ’ చేపడుతున్నట్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వెల్లడించింది. ఆ రోజున ఆయా కాలేజీల వద్దకు వెళ్లే పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తారని పార్టీ తెలియజేసింది. శాంతియుతంగా ఈ …

Read More »

అధ్యయన యాత్రకు జీవీఎంసీ కార్పొరేటర్లు పయనం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, పలువురు అధికారులు అధ్యయన యాత్రకు మంగళవారం విశాఖ నుండి బయలుదేరి వెళ్లడం జరిగిందని జీవీఎంసీ కార్యదర్శి బి.వి. రమణ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతోపాటు 82 మందికార్పొరేటర్లు, పలువురు అధికారులుమంగళవారంవిశాఖవిమానాశ్రయం నుండిఅధ్యయనయాత్రకుబయలుదేరారని, వీరిలో 43 మంది మహిళా కార్పొరేటర్లు అధ్యయన యాత్రలో వున్నారన్నారు. కార్పొరేటర్ల బృందం  16వ తేదిన విశాఖపట్నంలో బయలు దేరి 24వ తేదీ వరకు జైపూర్, జోధపూర్, జై సల్మార్, ఢిల్లీ ప్రాంతాలలోని మున్సిపల్ …

Read More »

19న వైయస్సార్‌సీపీ ‘ఛలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం

అమరావతి,ఐఏషియ న్యూస్: తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ కేంద్ర కమిటీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం

రక్తదానానికి ముందడుగు వేసిన విద్యార్థులు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయభారతి చింతపల్లి,ఐఏషియ న్యూస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా మెగా రక్తదాన శిబిరంలో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థినీ ,విద్యార్థులు మరియు అధ్యాపకులు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 54 మంది రక్త దానము చేశారు. దీనికి సంబంధించి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అయిన జిల్లాకలెక్టర్, జిల్లా మెడికల్ ఆఫీసర్ సంతకంతో, రెడ్ క్రాస్ నోడల్ అధికారి సంతకంతో కూడిన సర్టిఫికెట్స్ ను సోమవారం …

Read More »

జాతీయ అవార్డు గ్రహీత హెచ్ఎం శ్రీదేవిని అభినందించిన జీవీఎంసీ కమిషనర్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రథమ స్థానం ఉపాధ్యాయులదేనని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు.సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా భీమిలి జీవీఎంసీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాదాబత్తుల తిరుమల శ్రీదేవికి ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్న సందర్భంగా ఆమెను కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో …

Read More »

గీతం ఎమ్‌సిఎ విద్యా ర్ధులకు భారీ వేతనంతో ఉద్యోగాలకు ఎంపిక

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ప్రముఖ ఐటి సంస్థ మైక్రాన్‌ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ద్వారా ఎమ్‌సిఎ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్ధులను భారీ వేతనంలో ఎంపిక చేసుకుంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం లోనే జరిగిన ఈ ప్రాంగణ నియామకంలో ఎమ్‌సిఎ ఆఖరి సంవత్సరం విద్యార్ధులు ఎస్‌.లహరి మోహన్‌, ఎమ్‌.వర్షిణి, పి.భవాని, కె.హర్షవర్ధన్‌రెడ్డి, ఎన్‌.మనోజ్‌ రూ.12.26 లక్షల వార్షిక వేతనంతో మైక్రాన్‌ సంస్థకు ఎంపికయ్యారు గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఎమ్‌సిఎ సహ పలు సైన్స్‌ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ప్రత్యేకంగా నిర్వ హిస్తున్న కెరీర్‌ …

Read More »