బనగానపల్లె/నంద్యాల,ఐఏషియ న్యూస్: బీహార్ రాష్ట్రం బోద్ గయలో ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే 44వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు బనగానపల్లెలోని నెహ్రూ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ తొమ్మిదవ తరగతి విద్యార్థి లోకేష్ యాదవ్ ఎంపికైనట్లు కరస్పాండెంట్ కోడూరు హరినాథ్ రెడ్డి తెలిపారు. తమ విద్యా సంస్థలు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు మొదలగు వాటిలో మెరుగుపడేందుకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.ఎంపికైన విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ జాతీయస్థాయి పోటీల్లోరాణించాలన్నారు.విద్యార్థి ఎంపికకు …
Read More »Education
విద్యుత్ శాఖలో త్వరలోనే 2,511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి,ఐఏషియ న్యూస్: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. 1,711 జూనియర్ లైన్మెన్, 800 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్కో, ట్రాన్స్కో వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు సీఎంకు వివరించారు.సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించగా, త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఇది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అని చెప్పాలి. Authored by: Vaddadi …
Read More »మట్టిలో దాగున్న బంగారు నిధి..మన దేశంలోని 5 పెద్ద బంగారు గనులివే
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. భూగర్భ శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా కష్టపడి చేసిన పరిశోధనల తర్వాత ఈ అరుదైన విషయాన్ని ధృవీకరించారు.ఈ కొత్త ఆవిష్కరణ మధ్యప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, మన దేశంలో ఇంకా చాలా చోట్ల ఇలాంటి బంగారు నిధులున్నాయి.ఆ విశేషాలు, భారతదేశంలోని అతిపెద్ద ఐదు బంగారు గనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ హట్టి గోల్డ్ మైన్స్ భారతదేశంలోనే …
Read More »సామాజిక సేవలో సిఎల్సి చర్చి
విద్యార్థులకు గ్లాసులు,మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ బుచ్చయ్యపేట,,ఐఏషియ న్యూస్: అమెరికా దేశీయుల సహకారంతో, గాజువాక సిఎల్సి చర్చి అధినేత సుధీర్ కే మహంతి ఆధ్వర్యంలో బుధవారం బుచ్చయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్లాసులు, కంచాలు పంపిణీ చేయడంతో పాటు, ఎల్బీపురం, బంగారు మెట్టల మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అలాగే త్రాగునీటి బోర్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ మహంతి అందిస్తున్న సేవలు అభినందనీయమైనవి. అమెరికాలోపుట్టి,భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో అభివృద్ధి, సేవా …
Read More »సెప్టెంబర్ 1 నుంచి హాల్మార్క్ తో వెండి ఆభరణాలు అందుబాటులోకి
బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: వెండి నగలు కొంటున్నారా అయితే ఈ కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెండి 900, 800, 835, 925, 970, 990 స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ ప్రవేశపెట్టనున్నారు. హాల్మార్కింగ్ …
Read More »ఫోటోగ్రఫీ-2025 అవార్డులు పొందిన విశాఖ ఫోటో జర్నలిస్టులు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ , విజయవాడ ఆధ్వర్యంలో రాబోయే 20వ తేదీన 186వ ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా కండక్ట్ చేసిన జాతీయ ఫోటోగ్రఫి 2025 పోటీలలో, స్పాట్ న్యూస్,జనరల్ విభాగాలలో అవార్డులు గెలుపొందిన వైజాగ్ ఫోటో జర్నలిస్ట్స్. ఈ అవార్డు పొందిన వారిలో విశాఖకు చెందిన కె ఆర్ దీపక్ ది హిందూ, వై.రామకృష్ణ ఆంధ్రజ్యోతి, పి ఎల్ మోహన్ సాక్షి, ఏ శరత్ కుమార్ టైమ్స్ అఫ్ ఇండియా, వి రాజు ది హిందూ, పి ఎన్ …
Read More »సివిల్స్ ఫ్రీ క్వాలిఫై విద్యార్థులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యారంగంపై దృష్టి సారించి పలు కీలక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ లాంటి అత్యంత కఠినమైన పోటీ పరీక్షలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. వాళ్లు మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున పంపిణీ చేసింది. ఈమేరకు చెక్కులను విడుదల చేసింది. దీనిలో భాగంగానే సివిల్స్-2025 …
Read More »అల్లూరి జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి రూ.45.02 కోట్లు మంజూరు
మారుమూల గిరిజన స్కూళ్ల అభివృద్ధికి మంత్రి లోకేష్ చొరవ అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్ర విద్యారంగంలో దశాబ్ధాలుగా వేళ్లూనుకున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర విద్య,ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. విద్యా శాఖను సవాల్ గా స్వీకరించిన లోకేష్ గత ఏడాదికాలంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు అనునిత్యం పడుతున్న ఇబ్బందులను వివిధ ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న లోకేష్… వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి నడుంకట్టారు. గిరిజన ప్రాంతాలలో నూరుశాతం శాశ్వత …
Read More »దేశంలో అత్యంత సురక్షితమైన టాప్ టెన్ నగరాలు ఇవే
ఈ జాబితాలో హైదరాబాదుకు దక్కని చోటు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా సురక్షిత దేశాలు, నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ సంస్థ నంబియో సేఫ్టీ ఇండెక్స్ తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన సేఫ్టీ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో ప్రజల భద్రత, నేరాల తీవ్రత, మహిళలపై దాడుల రేటు,దొంగతనాలు,మాదకద్రవ్యాల వినియోగం తదితర అంశాలను ఆధారంగా తీసుకుంది. ఇక నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్ లో టాప్-10 సురక్షితమైన నగరాల జాబితాలో కర్ణాటకరాష్ట్రంలోని మంగళూరు తొలి స్థానాన్ని దక్కించుకుంది.అలాగే …
Read More »నేడు జాతీయ చేనేత దినోత్సవం
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: దారం పోగును వస్త్రంగా మలచి,మనిషి మానాన్ని కాపాడేది చేనేత. చేనేత వస్త్రం కేవలం ఒక వస్తువు కాదు, అది మన సంస్కృతికి, సంప్రదాయానికి, కళాత్మకతకు ప్రతీక. మన అస్థిత్వాన్ని, అసలైన గుర్తింపును చాటిచెప్పే చేనేత వస్త్రాలను ధరించడం మనందరి బాధ్యత.జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 7న జరుపుకుంటాము. 1905లో ఇదే రోజున స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. విదేశీ వస్తువులను బహిష్కరించి,స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఆనాడు పిలుపునిచ్చారు. ఈ స్ఫూర్తితోనే, మన చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడి జీవించే …
Read More »
News Website (iasianews.net) I Asia News