బాధ్యత మరిచిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సస్పెన్షన్

శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: ఆమె ఒక బాధ్యత గల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి బంగారు భవితను తీర్చిదిద్దాల్సిన వ్యక్తి. తరగతిలో పాఠాలు బోధించి విద్యార్థులలో జ్ఞానాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తరగతి గదిలో వారితో కాళ్లు పట్టించుకుంది ఆ ఉపాధ్యాయురాలు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో ఉన్న బందపల్లిబాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది.వై. సుజాత అనే మహిళ బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. అయితే సుజాత విద్యార్థులతో తరగతి గదిలో కాళ్లు పట్టించుకున్న ఫోటో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయురాలు ఓ వైపు ఫోన్ మాట్లాడుతుంటే.ఇద్దరు విద్యార్థినులు ఆమె కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజనం భిన్నరకాలుగా స్పందించారు.సోషల్ మీడియా వేదికగా సదరు హెచ్ఎం వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వరకూ చేరింది. దీంతో ఐటీడీఏ సీతంపేట పీవో సదరు ప్రధాన ఉపాధ్యాయురాలికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అందరితో ఆగకుండా ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు. హెచ్ఎం పనితీరుపై ఆర్డిఓ విచారణకు ఐటీడీఏ పీవో ఆదేశించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అంగన్వాడి కార్యకర్తలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: అంగన్వాడీ కార్యకర్తలకు ఉచిత మొబైల్ ఫోన్స్ (5జి టెక్నాలజీ) 12,500 ఖరీదైన మొబైల్ ఫోన్స్ ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *