పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: పెందుర్తి వెలంతోట ప్రాంతానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నేమాని భవానీశంకర్ (84) ఈనెల 29న మృతి చెందారు. నేపథ్యంలో ఆయన నేత్రాలను కుమారులు ఐ బ్యాంకుకు దానం చేసి ఆదర్శంగా నిలిచారు.స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ఛారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొహిసిన్ నేత్రనిధి కేంద్రం టెక్నీషియన్ మృతుని కళ్ల నుంచి కార్నియాను సేకరిం చారు. Authored by: Vaddadi udayakumar
Read More »Health
కన్నీటి కరూర్ కార్నర్ సమావేశం
తొక్కిసలాటలో 38 మంది దుర్మరణం..100మందికి పైగా క్షతగాత్రులు హుటాహుటిన కరూర్ చేరుకున్న సీఎం స్టాలిన్.. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చెన్నై,ఐఏషియ న్యూస్: తమిళనాట పెను విషాదం చోటుచేసుకుంది. ఒక రాజకీయ సభ మృత్యు వేదికగా మారింది. తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మించిన జనం తరలివచ్చారు. దారులు మొత్తం కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పి… తొక్కిసలాటకు దారి తీసింది. అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం… …
Read More »డ్యూటీ లోనే గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
పెందుర్తి,ఐఏషియ న్యూస్: గుండెపోటుతో ఎస్.కోట ఏపీఎస్ఆర్టీ సీ డిపోకు చెందిన కండక్టర్ మంగళవారం మృతి చెందారు. ఎస్. కోట ఏపీఎస్ఆర్టీ డిపో సూపరిండెంట్ వెంకట్రావు తెలియజేసిన వివరాలు ప్రకారం విశాఖ నుంచి కించుమండ వెళుతున్న బస్సులో పెందుర్తి మండలం సరిపల్లి గ్రామ సమీపంలో కండక్టర్ ఈశ్వరరావు తాను కూర్చున్న సీటులోనే గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన ప్రయాణికులు,డ్రైవర్ కండక్టర్ ఈశ్వరరావును పెందుర్తి ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో విషాద ఛాయలు అలముకొన్నాయి. Authored by: Vaddadi udayakumar
Read More »ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి
సిజేరియన్ ఆపరేషన్లు ఆందోళన కలిగిస్తోంది సహజ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేస్తాం అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు హెచ్చరిక ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.అలాగే ఏపీలో సిజేరియన్ ఆపరేషన్లు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వాటిలో 90 శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి ధోరణిని ఏమాత్రం ఆమోదించదని హెచ్చరించారు.సహజ …
Read More »అర్ధరాత్రి నిండు గర్భిణీని ఆదుకున్న108 సిబ్బంది
టెక్కలి 108 లో గిరిజన మహిళ సుఖప్రసవం టెక్కలి(శ్రీకాకుళం),ఐఏషియ న్యూస్: మందస మండలం బంసుగాం గిరిజన గ్రామానికి చెందిన సవర రుక్మిణి మొదటి కాన్పు పుట్టినొప్పులతో శుక్రవారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి నుంచి అర్ధరాత్రి టెక్కలి ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. గర్భిణీ ప్రసవంకి సహకరించక పోవడంతో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్ కి రిఫర్ చేశారు. టెక్కలి 108 లో రిమ్స్ కి తీసుకువెళ్తుండగా కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామం వద్దకు వచ్చేసరికి పురిటి నొప్పులు ఎక్కువ …
Read More »నేడు వైయస్సార్‌సీపీ ‘ఛలో మెడికల్ కాలేజీ’
పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం తాడేపల్లి,ఐఏషియ న్యూస్: తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్ కాలేజీ’ చేపడుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వెల్లడించింది. ఆ రోజున ఆయా కాలేజీల వద్దకు వెళ్లే పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తారని పార్టీ తెలియజేసింది. శాంతియుతంగా ఈ …
Read More »378 రక్తదాన శిబిరాల్లో 56,265 యూనిట్ల రక్తం సేకరణ
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భంగా గుజరాత్ లో ప్రపంచ రికార్డు అహ్మదాబాద్,ఐఏషియ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి బుధవారం అడుగుపెట్టారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని గుజరాత్‌లో నిర్వహించారు. దీనిని అఖిల్ భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్ (ఏబిటి వైపి) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అతిపెద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ ‘నమో కే నామ్ రక్తదాన్’ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు …
Read More »కోనసీమ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన పులిమచ్చల చేప
అంతర్వేది,ఐఏషియ న్యూస్: కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద మత్స్యకారుల వలకు అరుదైన పులిమచ్చల టేకుచేప చిక్కింది.10-12 కిలోల బరువున్న ఈ చేప పొట్టలోని బ్లాడర్ ఔషధ తయారీలో ఉపయోగపడుతుంది. సాధారణంగా అరుదుగా లభించే ఈ చేపకు అక్వేరియం మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది.ప్రోటీన్ అధికంగా ఉండటంతో కండరాల పెరుగుదలకు,గుండె ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమని వైద్యులు తెలిపారు. Authored by: Vaddadi udayakumar
Read More »అల్లూరి జిల్లాలో గిరిజనులకు వంతెన కష్టాలు
పెదబయలు,ఐఏషియ న్యూస్:: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనుల కష్టాలు వర్ణానతీతం.పెదబయలు మండలంలోని జామిగుడ పంచాయతీ పరిధి తారాబుకి చెందిన కుమడ.శ్రీదేవికి శనివారం గుండె నొప్పి వచ్చింది.గ్రామానికి రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ రాక కుటుంబీకులు డోలికట్టి శ్రీదేవికి తారాబు జలపాతం వరకు మోసుకొచ్చి ఎత్తుకొని ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించారు.అక్కడ నుంచి జీపులో ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారు మాట్లాడుతూ..ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారులు స్పందించి తారాబు గ్రామానికి …
Read More »రఘు ఇంజినీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం
భీమునిపట్నం,ఐఏషియ న్యూస్: భీమునిపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం రఘు ఇంజనీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అదిక సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు 498 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో రఘు విద్యాసంస్థల చైర్మన్ రఘు కలిదిండి కరస్పాండెంట్ రమాదేవి ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ జగదీష్ డీన్ డాక్టర్ సతీష్ చౌదరి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ కృష్ణ కిషోర్ బి ఎస్ వెంకట్ రెడ్డి విభాగాదిపతులు విద్యార్థులు పాల్గొన్నారు రక్తదాతలకు చైర్మన్ …
Read More »