స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: పేద ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటాయి. విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అయితే ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు లేదా ప్రమాదం జరిగి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వైద్య చికిత్సలు పొందడం పేద, మధ్యతరగతి జీవులకు తలకు మించిన భారంగా మారుతుంటుంది.కుటుంబసభ్యులనుకాపాడుకునేందుకు ఉన్న ఆస్తులను కూడా తెగనమ్ముకుని ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేవారెందరో మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే అలాంటి పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలుస్తోంది ముఖ్యమంత్రి సహాయ నిధి.అయితే …
Read More »Health
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చేపల,మాంసం విక్రయదారులు
హుకుంపేట మండల కేంద్రంలోసంతల్లో కుళ్ళిన చేపలు మాంసం విక్రయాలు హుకుంపేట,ఐఏషియ న్యూస్: శనివారం సంతలో దర్జాగా కుళ్ళిన చేపలు విక్రయాలు జరుపుతున్నారు.అంతే కాకుండా నిషేధం ఉన్నటువంటి క్యాట్ ఫిష్ లు కూడా అమ్ముతున్నారు. అవి తినకూడదు అని తెలియని అమాయక గిరిజన ప్రజలు వాటిని కొనుగోలు చేసి తినడం వల్ల అనారోగ్యం పాలైన సందర్భాలు అనేకమే ఉన్నాయి. అంతేకాకుండా చేపల వ్యాపారులు వారి వ్యాపార సముదాయాలపై ఎర్రని తరపాలిన్ తో కప్పి ఉంచడంతో తార్పాలిని యొక్క ఎర్రని రంగు చేపల పై పడి చేపలు …
Read More »ఏపీ రాష్ట్రంలో ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియా కలకలం
అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియా కలకలం రేపుతున్నాయి.26 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం.ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి.వారం, పది రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్‌ఫెక్షన్స్ బయటపడతాయి. ఇప్పటివరకుచిత్తూరు (379), కాకినాడ (141),విశాఖ (123), కడప (91, నెల్లూరు (86), అనంతపురం (68), విజయనగరం (59)తదితర జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ …
Read More »దోమల కోసం వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనం
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: దోమల నివారణకు వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకరమైన మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల విజయవాడలోని ఒక షాపులో తనిఖీలు చేసి సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్‌కు పంపగా ఈ అగరబత్తీల్లో ప్రాణాంతక రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఈ అగరబత్తీలను వాడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Authored by: Vaddadi udayakumar
Read More »రైలు ప్రమాదంలో మరణించిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేత
ఎస్బిఐ శాలరీ ప్యాక్ ద్వారా మంజూరైన కోటి రూపాయలు చెక్కు అందించిన విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం,ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబులుగా పని చేస్తూ, ప్రమాదవసాత్తు జరిగిన ట్రైన్ ఏక్సిడెంట్లో మరణించిన బొబ్బిలి రామకోటి కుటుంబానికి స్టేట్ బ్యాంకు పోలీసు శాలరీ ప్యాకేజ్ ప్రయోజనంగా మంజూరు చేసిన కోటి రూపాయల చెక్కును మృతుని సతీమణి శ్రీమతి సిహెచ్.రమకు స్టేట్ బ్యాంకు అధికారుల సమక్షంలో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ జిల్లా …
Read More »2 కోట్ల ఆధార్ నంబర్లను డిఆక్టివేట్ చేసిన యూఐడీఏఐ
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతీయులకు ఆధార్ తప్పనిసరి. అయితే ఇటీవలి కాలంలో నకిలీ ఆధార్ కార్డులతో పథకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అయితే ఇలాంటి వాటిని తగ్గించి ఆధార్ డేటాబేస్ పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. దాదాపు 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను యూఐడీఏఐ తొలగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం సైబర్ నేరాలువిపరీతంగాపెరిగిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఈ …
Read More »హిందీ సినిమా దిగ్గజం ధర్మేంద్ర కన్నుమూత
ముంబయి,ఐఏషియ న్యూస్: మ్యాన్ ఆఫ్ హిందీ సినిమాగా ప్రసిద్ధి పొందిన హీరో ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ‘‘ధర్మేంద్ర అస్తమయంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో నివాళులర్పించారు. కొన్నిరోజుల కిందట ధర్మేంద్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ముంబయిలోని బీచ్‌కాండీ ఆస్పత్రిలో చేారారు. అయితే చికిత్స అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే పరిస్థితి విషమం కావడంతో చికిత్స పొందుతూ ధర్మేంద్ర మృతి చెందారు.నిజ జీవితానికి వస్తే రచయిత, ప్రేమికుడు, తండ్రి, ప్రపంచంలోని అందగాళ్లలో ఒకరు, తాగుడు అలవాటును అధిగమించిన …
Read More »సెల్ ఫోన్ అవసరానికి మించి వినియోగించడం వలన అనర్ధాలే ఎక్కువ
హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు సెల్ ఫోన్ వినియోగించటం నిబంధనకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి మనిషి ఒక పూట ఆహారం లేకపోయినా ఉండగలుగుతున్నాడు కానీ సెల్ ఫోన్ మాత్రం వదిలి ఉండలేకపోతున్నాడు .సెల్ ఫోన్ ఎక్కువ శాతం వినియోగించడం వలన చిన్న పిల్లలకు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. వైరస్ తో కూడిన జబ్బులు జ్వరాలు నరాల బలహీనతకు సంబంధించిన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. సెల్ ఫోన్ ప్రభావంతో జ్ఞాపకశక్తి తగ్గే …
Read More »ఎముక కాన్సర్ బాధితుడు పూర్వ విద్యార్థి యోగికి సహాయహస్తం
విరాళాలు సేకరించిన శ్రీ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థి యోగి కుటుంబ సభ్యులకు లక్ష ఐదు వేల రూపాయలు అందజేత గాజువాక,ఐఏషియ న్యూస్: గాజువాక శ్రీ రాఘవేంద్ర స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి యోగి ప్రస్తుతం ఎముక కాన్సర్‌తో తీవ్రంగా బాధపడుతున్నాడు.యోగి చికిత్సకు మొత్తం 25 లక్షలు రూపాయలు అవసరమైన పరిస్థితిలో, ప్రభుత్వం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేసింది. మిగతా వైద్య ఖర్చుల కోసం పాఠశాల యాజమాన్యం ముందుకువచ్చి సహాయం అందిస్తోంది. యోగి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న …
Read More »జర్రిల పాఠశాలలో30 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
సకాలంలో స్పందించి విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన ఉపాధ్యాయులు గూడెం కొత్తవీధి,ఐఏషియ న్యూస్: గూడెం కొత్తవీధి మండలంలోని జర్రెల గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థులు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు సకాలంలో స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థులను జర్రెల పీహెచ్సీకి తరలించి చికిత్స అందజేశారు.ఈ పాఠశాలలో సుమారు 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిలో సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు తెలియజేశారు. బుధవారం రాత్రి కందదుంప కూర వండటం జరిగిందని, 30 మంది విద్యార్థులు కంద దుంపలో …
Read More »
News Website (iasianews.net) I Asia News