ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చేపల,మాంసం విక్రయదారులు

హుకుంపేట మండల కేంద్రంలోసంతల్లో కుళ్ళిన చేపలు మాంసం విక్రయాలు

హుకుంపేట,ఐఏషియ న్యూస్: శనివారం సంతలో దర్జాగా కుళ్ళిన చేపలు విక్రయాలు జరుపుతున్నారు.అంతే కాకుండా నిషేధం ఉన్నటువంటి క్యాట్ ఫిష్ లు కూడా అమ్ముతున్నారు. అవి తినకూడదు అని తెలియని అమాయక గిరిజన ప్రజలు వాటిని కొనుగోలు చేసి తినడం వల్ల అనారోగ్యం పాలైన సందర్భాలు అనేకమే ఉన్నాయి.
అంతేకాకుండా చేపల వ్యాపారులు వారి వ్యాపార సముదాయాలపై ఎర్రని తరపాలిన్ తో కప్పి ఉంచడంతో తార్పాలిని యొక్క ఎర్రని రంగు చేపల పై పడి చేపలు ఇంకా తాజాగానే ఉన్నాయని నమ్మపలికి మరి మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అనేక మార్లు అధికారులు, కొనుగోలుదారులు వ్యాపారులను హెచ్చరించిన వారు తీరు మారలేదు. దింతో వారి వ్యాపారం ఆరు కుళ్ళు చేపలు మూడు క్యాట్ ఫిష్లుల వ్యాపారంగా ఉందనే చెప్పుకోవాలి. శనివారం సంతల్లో అధికారుల జాడ కనబడట్లేదని అనేకమంది వాపోతున్నారు. సంతల్లో తూనికల్లో భారీవ్యత్యాసాలు ఉన్నాయని, వస్తువుల్లో నాణ్యత పూర్తిగా లేదని అనే మాటలు వినిపించడం సర్వసాధారణం అయిపోయింది. కుళ్ళిన మాసం చేపలు వంటివి అమ్మకాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజల అభిప్రాయపడ్డారు.సంతలో కుళ్ళిన చేపలను అమ్ముతున్నారనే సమాచారం. కొనుగోలుదారులు నేరుగా పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, మహిళా పోలీస్ జ్యోతి, సచివాలయ సిబ్బంది చేపల దుకాణాల వద్దకు వెళ్లి కుళ్ళిన చేపలను గుర్తించి వాటిని తొలగించారు. మరలా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని వారు హెచ్చరించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *