ఏపీ సిఎస్ విజయానంద్ పదవీకాలం పొడిగింపు

3 నెలలు పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది.ఈ నెలాఖరున ఆయన రిటైర్ కావాల్సి ఉంది. అయితే విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో విజయానంద్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2026 ఫిబ్రవరి వరకూ విజయానంద్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. విజయానంద్ రిటైర్ అనంతరం నూతన సీఎస్‌గా ఏపీ జలవనరుల శాఖ,సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ జి.సాయిప్రసాద్‌ నియమితులు కానున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *