వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఆ యువతిని అనారోగ్యం కబలించింది. యువతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి లేదన్న వార్త తెలియడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ, నాగమణి దంపతుల కుమార్తె అయిన రాజ్యలక్ష్మి(23) విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. 2023లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లింది. ఇటీవల …
Read More »Health
కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కింగ్ జార్జి ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నంలో రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొని ఎక్స్రే ఆవిష్కర్త డాక్టర్ రాంట్జెన్ కి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేడియాలజిస్టుల సంఘ అధ్యక్షులు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ప్రజల్లో రేడియాలజీ సేవల పట్ల అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ వాణి సందేశాన్నిస్తూ ప్రజల నుండి రేడియాలజీ సేవల కోసం ఎంతో ఒత్తిడితో కూడిన డిమాండ్ ఉన్నప్పటికీ కేజీహెచ్ లో మంచి సేవలు అందిస్తున్నారని హర్షం …
Read More »కేజీహెచ్ లో అంధకారం: ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ సీఎం జగన్
తాడేపల్లి,ఐఏషియ న్యూస్: ప్రతిష్ఠాత్మక విశాఖ కేజీహెచ్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రోగులు అంధకారంలో మగ్గిపోయారు. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంత పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని …
Read More »జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలలో విజృంభించిన మలేరియా
చికిత్స కోసం విద్యార్థులను ఆసుపత్రికి తరలింపు అరకు/అనంతగిరి,ఐఏషియ న్యూస్: ఏయస్ ఆర్ జిల్లా ఆనంతగిరి మండలం జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలలో మలేరియా విజృంభించింది. విద్యార్థులను దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స చేసి ముగ్గురు బాలికను అనకాపల్లి జిల్లా కె కోటపాడు 50 పడకల ఆసుపత్రికి బుధవారం రాత్రి 9-20 నిమిషాల కు 108 లో తరలించారుగిరిజన బాలికలు పట్ల (ఉపాద్యాయులు) ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల ఈ పరిస్థితి దాపురించిందని, విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. …
Read More »17 నుండి 30 వరకు కుష్టువ్యాధి గుర్తింపు సర్వే
శరీరంపై స్పర్శలేని మచ్చలుంటే తెలపండి: కలెక్టర్ హరేందిర ప్రసాద్ విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: జిల్లాలోని ఈ నెల 17 నుండి 30 వ తేదీ వరకు కుష్టువ్యాధిని గుర్తించే కార్యక్రమం (ఎల్సిడిసి) పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేందిర ప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కుష్టువ్యాధి సర్వే పై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ హారంధిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధి …
Read More »దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు
అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1,750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి తెలిపారు.ఈ నెల 25 లోపు www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, రెగ్యులర్ డిగ్రీ, ఆపై ఉన్నతవిద్య చదువుతున్న విద్యా ర్థులు, పదో తరగతి ఉత్తీర్ణులై స్వయంఉపాధితో జీవించేవారు,18 నుంచి 45 ఏళ్ల లోపు ఉండి 70 శాతం అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసు కొనేందుకు అర్హులని మంత్రి వీరాంజనేయస్వామి వెల్లడించారు. Authored by: Vaddadi udayakumar
Read More »కేజీహెచ్ కు దివిస్ సంస్థ 2.50 లక్షల విలువైన 3 సీటర్ల 25 రోచైర్లు విరాళం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కింగ్ జార్జ్ ఆసుపత్రికి (కేజిహెచ్) డివిస్ ల్యాబొరేటరీస్ వారు సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా రూ.2.50 లక్షల విలువైన 3 సీటర్ల 25 రోచైర్లు మంగళవారం విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, సిఎస్‌ఆర్‌ఎమ్‌ఓ డాక్టర్ ఉ. శ్రీహరి, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్.డాక్టర్.శ్రీనివాస్ పాల్గొన్నారు.సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి దివిస్ ల్యాబొరేటరీస్ వారి ఉదార సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ,ఈ చైర్లు ఆసుపత్రి రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం
తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం ఘటన జరిగిన వెంటనే అందరినీ అప్రమత్తం చేశాం ఇకపై ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన దేవాలయాలపై నిరంతర పర్యవేక్షణ కాశీబుగ్గ దేవాలయానికి అనుకోకుండా పెద్దఎత్తున భక్తులు తరలిరావడం వల్ల తోపులాట పలాసలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కాశీబుగ్గ ఆలయంలో తోపులాట జరిగిన ప్రాంతం పరిశీలన పలాస సీహెచ్ సీలో క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి లోకేష్ పలాస,ఐఏషియ న్యూస్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి అనుకోకుండా పెద్దఎత్తున భక్తులు తరలిరావడం వల్ల …
Read More »ఏపీలో తిరిగి ప్రారంభమైన ఎన్టీఆర్ వైద్య సేవలు
అమరావతి,ఐఏషియ న్యూస్: ఎన్టీఆర్ వైద్య సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ అంగీకరించింది.ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ తమ ఆందోళనను విరమించింది. అలాగే ఎన్టీఆర్ వైద్యసేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపింది. మరోవైపు చర్చల సందర్భంగా మరో రూ.250 కోట్లు బకాయిలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. నవంబర్ నెల చివరి నాటికి పెండింగ్ బకాయిలును ఒకే విడతలో చెల్లిస్తామని ఏపీ ఆరోగ్య …
Read More »చికిత్స పొందుతూ గర్భిణీ స్త్రీ మృతి
గొలుగొండ,ఐఏషియ న్యూస్: గొలుగొండ మండలం ఎటిగైరంపేట గ్రామానికి చెందిన మాకిరెడ్డి లోవ (27) అనే ఏడు నెలల గర్భిణీ స్త్రీ వైద్యం పొందుతూ బుధవారం మృతి చెందింది. తుఫాన్ నేపథ్యంలో హై రిస్క్ గర్భిణీలను ముందస్తు జాగ్రత్త చర్యగా ఈనెల 25న నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించాలని వైధ్యఅధికారులు ఆదేశాలు జారీ చేశారు.దీననుసరించి వైద్య సిబ్బంది లోవను ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది.అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, ఆమెను విశాఖ కేజీహెచ్ కు తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అనంతరం ఆమెను …
Read More »
News Website (iasianews.net) I Asia News