Health

ఈ యాప్ ఉంటే చాలు.. కల్తీ మద్యం కనిపెట్టొచ్చు..ఏపీ ప్రభుత్వం ఆలోచన

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి దాకా 23 మందిని నిందితులుగా గుర్తించినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. 23 మంది నిందితుల్లో ఇప్పటి వరకూ 14 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావును కస్టడీలోకి తీసుకున్నట్లు మంత్రి వివరించారు. మిగిలిన నిందితులను …

Read More »

నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుల బంద్

బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు చేస్తాం అన్న ప్రైవేటు హాస్పిటల్ సంఘం 2,700 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ ఏపీ స్టేట్ బ్యూరో ,ఐఏషియ న్యూస్: ఏపీలో శుక్రవారం నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారికి చుక్కలు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని వాడుకునేందుకు వీల్లేగుండా ప్రైవేటు ఆస్పత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ సేవల్ని నిలిపేయాలని నిర్ణయించింది. దీంతో రోగులు తమ సొంత డబ్బులు పెట్టి మరీ వైద్యం చేయించుకోక తప్పని పరిస్ధితులు …

Read More »

పోలీసులు అదుపులో దగ్గు మందు ఫార్మా కంపెనీ యజమాని

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లో మూత్రపిండాల వైఫల్యం కారణంగా 20 మంది మరణించిన కేసులో చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్‌ను అరెస్టు చేశారు.పోలీసులు గురువారం ఉదయం చెన్నై లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్ రిఫ్ దగ్గు మందు తాగి ఒక్క మధ్య ప్రదేశ్‌లోనే 20 మంది …

Read More »

కేజీహేచ్ లో విద్యార్థినులను పరామర్శించిన హోం మంత్రి అనిత

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్:  పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో ఆమె మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో హోం మంత్రి అనిత మాట్లాడారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని, వైద్యు నిపుణులతో ఓ కమిటీ వేశామని తెలిపారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు.పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు …

Read More »

పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటుతో బాలిక మృతి

అనంతగిరి,ఐఏషియ న్యూస్: పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటుతో బాలిక చనిపోయిన ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాలు. ప్రకారం.మండలంలోని మంగళవారం చెరుకుమడత పరిసర ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగు పడింది.ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బట్నాయిని కీర్తి(16) పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటికే ఆ బాలిక మృతి చెందింది.కీర్తి మృతితోచెరుకుమడతలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రభుత్వ అధికారులేగుర్తించిబాలికనుకోల్పోయినతల్లిదండ్రులను అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

పోర్టు హాస్పిటల్ ను కాపాడుకుంటాం 365వ రోజు నిరసన

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ అపాలని 365వ రోజు హాస్పటల్ వద్ద మానవహారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు గౌరవ అధ్యక్షులు పద్మనాభ రాజు మాట్లాడుతూ మన పోరాటం వలన గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ను కాపాడుకుంటాం. టెండర్ కి ఎవరి రాలేదు, హాస్పిటల్ అభివృద్ధి కోసం చైర్మన్ కమిటీ వేయడం జరిగింది. పోర్ట్ దగ్గర ఉన్న సోంత నిధులతో అభివృద్ధి చేయాలిహాస్పిటల్ ప్రైవేటీకరణ పై 365 రోజులుగా మాట్లాడుతున్న కార్మికులకు అభినందనలు.హాస్పిటల్ ప్రైవేటీకరణ అనైతికమని, హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, …

Read More »

విశ్రాంత రైల్వే ఉద్యోగి నేత్రాలు దానం

పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: పెందుర్తి వెలంతోట ప్రాంతానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నేమాని భవానీశంకర్ (84) ఈనెల 29న మృతి చెందారు. నేపథ్యంలో ఆయన నేత్రాలను కుమారులు ఐ బ్యాంకుకు దానం చేసి ఆదర్శంగా నిలిచారు.స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ఛారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొహిసిన్ నేత్రనిధి కేంద్రం టెక్నీషియన్ మృతుని కళ్ల నుంచి కార్నియాను సేకరిం చారు. Authored by: Vaddadi udayakumar

Read More »

కన్నీటి కరూర్‌ కార్నర్ సమావేశం

తొక్కిసలాటలో 38 మంది దుర్మరణం..100మందికి పైగా క్షతగాత్రులు హుటాహుటిన కరూర్‌ చేరుకున్న సీఎం స్టాలిన్‌.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ చెన్నై,ఐఏషియ న్యూస్: తమిళనాట పెను విషాదం చోటుచేసుకుంది. ఒక రాజకీయ సభ మృత్యు వేదికగా మారింది. తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మించిన జనం తరలివచ్చారు. దారులు మొత్తం కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పి… తొక్కిసలాటకు దారి తీసింది. అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం… …

Read More »

డ్యూటీ లోనే గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

పెందుర్తి,ఐఏషియ న్యూస్: గుండెపోటుతో ఎస్.కోట ఏపీఎస్ఆర్టీ సీ డిపోకు చెందిన కండక్టర్ మంగళవారం మృతి చెందారు. ఎస్. కోట ఏపీఎస్ఆర్టీ డిపో సూపరిండెంట్ వెంకట్రావు తెలియజేసిన వివరాలు ప్రకారం విశాఖ నుంచి కించుమండ వెళుతున్న బస్సులో పెందుర్తి మండలం సరిపల్లి గ్రామ సమీపంలో కండక్టర్ ఈశ్వరరావు తాను కూర్చున్న సీటులోనే గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన ప్రయాణికులు,డ్రైవర్ కండక్టర్ ఈశ్వరరావును పెందుర్తి ఆరోగ్య కేంద్రానికి  తరలించగా  అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో విషాద ఛాయలు అలముకొన్నాయి. Authored by: Vaddadi udayakumar  

Read More »

ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి

సిజేరియన్ ఆపరేషన్లు ఆందోళన కలిగిస్తోంది సహజ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేస్తాం అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు హెచ్చరిక ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.అలాగే ఏపీలో సిజేరియన్‌ ఆపరేషన్లు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వాటిలో 90 శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి ధోరణిని ఏమాత్రం ఆమోదించదని హెచ్చరించారు.సహజ …

Read More »