Health

కర్నూలు బస్సు మృతులకు 5 లక్షలు,క్షతగాత్రులకు రెండు లక్షలు నష్టపరిహారం

కర్నూలు,ఐఏషియ న్యూస్: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం డిజిపి హరీష్ కుమార్ గుప్త రవాణా శాఖ మంత్రితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.అందులో ఏపీ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి ఆరుగురు, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. ఒడిశా, బీహార్ నుంచి ఒక్కొక్కరు ప్రాణాలు …

Read More »

స్వర్ణముఖి నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

,ఐఏషియ న్యూస్: తిరుపతి జిల్లా రూరల్ మండలంలోని వేదాంతపురం సమీపంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం అగ్రహారం గ్రామానికి చెందిన 7 మంది యువకులు నదిలో ఈత కొడుతుండగా ప్రమాదం జరిగిందని,ఇసుక దిబ్బలపై ఆడుతూ స్నానం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహానికి నలుగురు యువకులు కొట్టుకుపోయారని తెలిపారు. ముగ్గురు మాత్రం స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత శాఖలకు అప్రమత్తం అవ్వాలని, గల్లంతైన విద్యార్థుల కోసం …

Read More »

ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వ‌ర్క్ఆసుప‌త్రుల‌కు 250 కోట్లు బకాయిలు విడుద‌ల

విజయవాడ,ఐఏషియ న్యూస్: డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ‌(నెట్వ‌ర్క్‌) ఆసుప‌త్రుల బ‌కాయిల్లో రూ.250 కోట్లను ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి విడుద‌ల చేసింది. నిధుల చెల్లింపుల‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తో చ‌ర్చించారు. అనంత‌రం చ‌ర్య‌ల్లో భాగంగా నిధుల విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. అలాగే త్వ‌ర‌లో మ‌రో రూ.250 కోట్ల‌ను చెల్లించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వైద్యారోగ్య శాఖ కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్ తెలిపారు.రోగుల‌కు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వైద్య‌ సేవ‌ల్ని కొన‌సాగించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ …

Read More »

ఐస్ల్యాండ్ లో తొలిసారిగా కనిపించిన దోమ

ఐస్ల్యాండ్,ఐఏషియ న్యూస్: ప్రపంచంలోనే దోమలు లేని దేశంగా పేరుగాంచిన ఐస్ల్యాండ్లో తొలిసారిగా దోమలు కనిపించాయి. వెస్ట్రన్ ఐస్ల్యాండ్లోని ఓ అడవిలో వీటిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తాజాగా తెలిపారు. ఇదివరకు విమానంలో ఒక దోమను గుర్తించినా, ఇప్పుడు సహజ వాతావరణంలో కనుగొనడం ఇదే తొలిసారి.వాతావరణ మార్పుల కారణంగానే ఈ కీటకాలు ఇక్కడికి వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.ఈ దోమల ఆగమనం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయనడానికి సంకేతం.దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. Authored by: Vaddadi udayakumar

Read More »

రాష్ట్రంలో కొత్తగా ఏడు డయాలసిస్ కేంద్రాలు: పీపీపీ విధానంలో నిర్వహణ

అమరావతి,ఐఏషియ న్యూస్: ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట,విజయనగరం జిల్లా ఎస్. కోట,పశ్చిమగోదావరి జిల్లా భీమవరం,బాపట్ల జిల్లా అద్దంకి,నంద్యాల జిల్లా సున్నిపెంట,చిత్తూరు జిల్లా పీలేరు,శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వైద్యశాలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.పీపీపీ విధానంలో వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఒక్కో కేంద్రంలో 5 చొప్పున రక్తశుద్ధి యంత్రాలు,ప్రతి కేంద్రానికి అనుబంధంగా ఆర్వో ప్లాంటు ఏర్పాటవుతాయని మంత్రి …

Read More »

తల్లిదండ్రులను నిస్మరిస్తే ప్రభుత్వ ఉద్యోగులు జీతంలో 10శాతం కోత

చట్టం చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలో మరో విడత ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తయింది. గ్రూప్- 2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా నియామక పత్రాలను అందజేశారు. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి తల్లితండ్రులు తమ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భూజాన మోసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని రేవంత్ …

Read More »

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం: బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: రాజధాని దిల్లీ శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం సుమారు 1:20 గంటల ప్రాంతంలో దిల్లీలోని బిషంబర్ దాస్ మార్గ్‌లో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. తక్షణమే స్పందించిన అధికారులు దాదాపు 14 …

Read More »

అటుగా వెళుతూ ప్రమాదం గుర్తించి స్వయంగా క్షతగాత్రుడుకి సహాయం అందించిన డి.ఎస్.పి గూడూరుకుమారి

వెంకటగిరి,ఐఏషియ న్యూస్: తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం సమీపం లోని జాతీయ రహదారి పై తిరుపతి వెళ్ళే మార్గంలో ఆర్టీసీడిపో ఎదురుగా ఆటో బైక్ ను డీ కొట్టినట్లు ఈ ప్రమాదంలో ఓ యువకుడు గాయపడినట్లు తెలుస్తుంది. అదే సమయం లో అటు వైపు గా వెళుతున్న గూడూరు డీఎస్పీ గీతా కుమారి వెంటనే తన వాహనం ఆపి క్షతగాత్రుడు నీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని ఆదేశించారు…ఘటన లో గాయపడిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar

Read More »

డిగ్రీ కళాశాలలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం

చింతపల్లి,ఐఏషియ న్యూస్: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎండి అనస్థీషియా విభాగానికి చెందిన డాక్టర్ సాహితి పాల్గొని, విద్యార్థులలో ప్రాథమిక వైద్య నైపుణ్యాలపై అవగాహన పెంచే దిశగా ఉపయోగకరమైన సమాచారాన్ని అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి అధ్యక్షత వహించారు. తన ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ, ప్రతిఒక్కరు సిపిఆర్ వంటి ప్రాథమిక వైద్య పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం ద్వారా అనేక …

Read More »

ఈ యాప్ ఉంటే చాలు.. కల్తీ మద్యం కనిపెట్టొచ్చు..ఏపీ ప్రభుత్వం ఆలోచన

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి దాకా 23 మందిని నిందితులుగా గుర్తించినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. 23 మంది నిందితుల్లో ఇప్పటి వరకూ 14 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావును కస్టడీలోకి తీసుకున్నట్లు మంత్రి వివరించారు. మిగిలిన నిందితులను …

Read More »