కర్నూలు బస్సు మృతులకు 5 లక్షలు,క్షతగాత్రులకు రెండు లక్షలు నష్టపరిహారం

కర్నూలు,ఐఏషియ న్యూస్: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం డిజిపి హరీష్ కుమార్ గుప్త రవాణా శాఖ మంత్రితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.అందులో ఏపీ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి ఆరుగురు, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. ఒడిశా, బీహార్ నుంచి ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియా రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నాము. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడిన 9 మంది ప్రయాణికులకు చికిత్స కొనసాగుతోంది. మీడియా సమావేశానికి ముందు మంత్రి అనిత బస్సు దగ్ధం జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

19 ఏళ్లకే ఎనిమిది పెళ్లిళ్లు.. పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ఇచ్చాపురం యువతి

ఇచ్చాపురం,ఐఏషియ న్యూస్: మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *