రాష్ట్రంలో కొత్తగా ఏడు డయాలసిస్ కేంద్రాలు: పీపీపీ విధానంలో నిర్వహణ

అమరావతి,ఐఏషియ న్యూస్: ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట,విజయనగరం జిల్లా ఎస్. కోట,పశ్చిమగోదావరి జిల్లా భీమవరం,బాపట్ల జిల్లా అద్దంకి,నంద్యాల జిల్లా సున్నిపెంట,చిత్తూరు జిల్లా పీలేరు,శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వైద్యశాలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.పీపీపీ విధానంలో వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఒక్కో కేంద్రంలో 5 చొప్పున రక్తశుద్ధి యంత్రాలు,ప్రతి కేంద్రానికి అనుబంధంగా ఆర్వో ప్లాంటు ఏర్పాటవుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 15 మంది దుర్మరణం

మారేడుమిల్లి,ఐఏషియ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *