హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు సెల్ ఫోన్ వినియోగించటం నిబంధనకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి మనిషి ఒక పూట ఆహారం లేకపోయినా ఉండగలుగుతున్నాడు కానీ సెల్ ఫోన్ మాత్రం వదిలి ఉండలేకపోతున్నాడు .సెల్ ఫోన్ ఎక్కువ శాతం వినియోగించడం వలన చిన్న పిల్లలకు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. వైరస్ తో కూడిన జబ్బులు జ్వరాలు నరాల బలహీనతకు సంబంధించిన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. సెల్ ఫోన్ ప్రభావంతో జ్ఞాపకశక్తి తగ్గే పరిస్థితులు వస్తాయి అంటున్నారు. సెల్ ఫోన్ లో వచ్చే గేమ్స్,యూట్యూబ్, ఓ టి టి, వెబ్ సిరీస్ లకు మరియు బెట్టింగ్ కు అలవాటు పడి బానిసై చాలా మంది ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఎంత సూచన చేసిన ప్రజల తీరుఏమాత్రం మారట్లేదు. భవిష్యత్తులో ఎలాంటి నేరాలు, ఘోరాలు జరుగుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News