అమరావతి,ఐఏషియ న్యూస్: రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. బియ్యంతో పాటు రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రేషన్ షాపులు మినీ మాల్స్ గా మారనున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇకపై ఉదయం 8 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు షాపులు అందుబాటులో ఉంటాయి.అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే సరుకులు చేరే విధంగా సదుపాయం కల్పించనున్నారు.ఇక కార్డ్ హోల్డర్లు సమీపంలోని ఏ రేషన్ షాపులో నైనా సరుకు తీసుకునే పోర్టబిలిటీ సదుపాయమూ అందుబాటులోకి రానుంది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News