రైలు ప్రమాదంలో మరణించిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేత

  • ఎస్బిఐ శాలరీ ప్యాక్ ద్వారా మంజూరైన కోటి రూపాయలు
  • చెక్కు అందించిన విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

విజయనగరం,ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబులుగా పని చేస్తూ, ప్రమాదవసాత్తు జరిగిన ట్రైన్ ఏక్సిడెంట్లో మరణించిన బొబ్బిలి రామకోటి కుటుంబానికి స్టేట్ బ్యాంకు పోలీసు శాలరీ ప్యాకేజ్ ప్రయోజనంగా మంజూరు చేసిన కోటి రూపాయల చెక్కును మృతుని సతీమణి శ్రీమతి సిహెచ్.రమకు స్టేట్ బ్యాంకు అధికారుల సమక్షంలో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న పోలీసు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, అందరికీ స్టేట్ బ్యాంకు పోలీసుశాలరీప్యాకేజ్,నుఇప్పటికేప్రారంభించామన్నారు. ఈ ప్యాకేజ్ ప్రయోజనంలో భాగంగా ఎవరైనా పోలీసు ఉద్యోగి విధి నిర్వహణలో భాగంగా ప్రమాదవసాత్తు మరణిస్తే వారి కుటుంబానికి కోటి రూపాయలు ఆర్ధిక సహాయంను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందించనుందన్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషనులో కానిస్టేబులుగా బొబ్బిలి రామకోటి పనిచేస్తూ, రైలు ప్రమాదంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న మరణించాడన్నారు. ఇదే విషయమై స్టేట్ బ్యాంకు అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపగా స్టేట్ బ్యాంకు అధికారులు మరణించిన బొబ్బిలి రామకోటి సతీమణి సిహెచ్.రమకు కోటి రూపాయలను మంజూరు చేశారని ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు.
మరణించిన కానిస్టేబులు రామకోటిని తిరిగి తీసుకొని రాలేకపోయినా వారి కుటుంబానికి జిల్లా పోలీసుశాఖ ఎల్లప్పుడూ అందుబాటులో అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ భరోసా కల్పించారు. ఎస్.బి.ఐ. ద్వారా వచ్చిన డబ్బులను వృదాగా ఖర్చు చేయవద్దని, కుమారుడు సిద్ధార్ద్ భవిష్యత్తుకు బాటలు వేయాలని, మంచిగా చదివించి, ప్రయోజకుడ్ని చేయాలని సిహెచ్. రమకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్ బి ఐ రీజనల్ మేనేజరు ఎం.సురేష్ బాబు,ఎస్.బి.ఐ. కంటోన్మెంట్ చీఫ్ మేనేజరు పి.రఘురామ్, ఎస్.బి.ఐ. ఆర్.బి.ఓ చీఫ్ మేనేజరు విజయకుమార్, ఎస్.బి.ఐ. డిపాజిట్స్ మేనేజరు ఒమ్మి వెంకటరావు,డిపిఓ ఎఓ పి.శ్రీనివాసరావు,ఆఫీసు సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఉషారాణి, పోలీసు అసోసియేషను అధ్యక్షులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *