Breaking News

దోమల కోసం వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనం

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: దోమల నివారణకు వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకరమైన మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల విజయవాడలోని ఒక షాపులో తనిఖీలు చేసి సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్‌కు పంపగా ఈ అగరబత్తీల్లో ప్రాణాంతక రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఈ అగరబత్తీలను వాడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *