Politics

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 16న పర్యటించబోతున్నప్రధాని నరేంద్ర మోదీ..

అమరావతి,ఐఏషియ న్యూస్: ప్రధాని మోదీ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు.కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొని, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సభ విజయవంతం కోసం మంత్రి లోకేశ్‌ అధికారులకు సూచనలు చేశారు. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ పర్యటనకు శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న ఉదయం 7.50 కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని బయల్దేరతారు. …

Read More »

ఈ యాప్ ఉంటే చాలు.. కల్తీ మద్యం కనిపెట్టొచ్చు..ఏపీ ప్రభుత్వం ఆలోచన

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి దాకా 23 మందిని నిందితులుగా గుర్తించినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. 23 మంది నిందితుల్లో ఇప్పటి వరకూ 14 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావును కస్టడీలోకి తీసుకున్నట్లు మంత్రి వివరించారు. మిగిలిన నిందితులను …

Read More »

మాజీ సీఎం జగన్ కు మహిళలు ఘన స్వాగతం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్:  విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డు కాకాని నగర్ వద్ద మాజీ సీఎం వైయస్ జగన్ ఘన స్వాగతం పలికిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పార్టీ మహిళా విభాగం నాయకులు. అక్కడినుంచి నర్సీపట్నం పయనమయ్యారు. Authored by: Vaddadi udayakumar

Read More »

చేపలు పట్టించడం నేర్పాలి తప్ప…చేపలు తెచ్చి ఉచితంగా ఇవ్వకూడదు

ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఒరిగిందేమీ లేదు ఉచిత పథకాలు అందిస్తున్న రాష్ట్రాలకు చురకలంటించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఉచితాల కోసం భారీగా ప్రభుత్వాలు అప్పులు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు విద్య, వైద్యంపై డబ్బులు ఖర్చుపెట్టాలని సూచించారు. మరోవైపు అసెంబ్లీలో బూతులు తిట్టుకునే సంప్రదాయానికి తెర వేయాలని రాజకీయ పార్టీలను కోరారు. విచ్చలవిడిగా ఉచిత పథకాలు …

Read More »

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసిన రాష్ట్ర వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు

విజయనగరం,ఐఏషియ న్యూస్: గోవా గవర్నర్‌ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పూసపాటి అశోక్ గజపతి రాజుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం విజయనగరంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

రెవిన్యూ క్లినిక్ ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి

పార్వతీపురం,ఐఏషియ న్యూస్: కలెక్టర్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటుచేసిన రెవిన్యూ క్లినిక్ ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. రెవిన్యూ సమస్యల పరిష్కారం కొరకు ఏర్పాటుచేసిన వివిధ విభాగాలను ఆమె ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది తో కలిసి పరిశీలించారు. రెవిన్యూ క్లినిక్ విచ్చేసిన అర్జీదారులతో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం

మీ రుణం తీర్చుకునేందుకే ఆటోడ్రైవర్ సేవలో పథకాన్ని ప్రవేశపెట్టాం ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ అమరావతి,ఐఏషియ న్యూస్:  గత ఎన్నికల్లో ప్రజలు మాపైన ఒక పవిత్ర బాధ్యత పెట్టారు. గత పాలకులు మీటింగ్ పెడితే పరదాలు, బారికేడ్లు కట్టేవారు. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సామాన్యుల మాదిరి మీ ముందుకు వచ్చారు. మీ రుణం తీర్చుకోవడమే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతిహామీ నిలుపుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని …

Read More »

జపాన్‌ తదుపరి ప్రధానిగా సనై తకైచి.. తొలిసారి మహిళకు అవకాశం

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్:  పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్‌ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలో ఈమె ప్రధాని పదవి చేపట్టనున్నారు. త్వరలోనే అధికార ప్రకటన రానున్నది. Authored by: Vaddadi udayakumar

Read More »

కొందరు ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అమరావతి,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు. వారి తీరు పైన మంత్రివర్గ భేటీలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యతలను ఇంఛార్జ్ మంత్రులు తీసుకోవాలని స్పష్టం చేసారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే ఇక తాను చర్యలు తీసుకోక తప్పదని తేల్చి చెప్పారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించినా కారణం ఏదైనా వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులేనని నిర్దేశించారు.అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు పైన సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. …

Read More »

జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: జాతీయ హైవేపై ఆయా రహదారుల సమాచారం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు తెలిపేలా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. ఈ క్యూఆర్ కోడ్‌లో సదరు రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారంతో పాటు నేషనల్ హైవే నంబర్, హైవే ఛైనేజ్, ప్రాజెక్ట్ పొడువు వివరాలను తెలియజేస్తాయి. ఇందులో హైవే గస్తీ, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజినీర్ల నంబర్లు, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1033, పెట్రోల్ బంక్, ఆస్పత్రుల వివరాలు ఉంటాయి. Authored by: Vaddadi udayakumar

Read More »