అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ.ఒక్కఓటు తేడాతో విజయం సాధించిన కోడలు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేద.అయితే నిజానికి ఆ ఓటు కూడా ఎంతో విలువైనది.డబ్బుల పరంగా కూడా.ఎన్నికలలో నిలబడిన కోడలి కోసం ఆమె మామ అమెరికా నుండి వచ్చి మరీ ఓటు వేశాడు కాబట్టి.సర్పంచ్ ఎన్నికలలోప్రతీ ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. ఒక్క ఓటే కదా అని నిజంగా …
Read More »Politics
ఇక వెబ్‌ల్యాండ్‌లో ఆధార్ సవరణ బాధ్యత తహసీల్దార్లదే
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భూయజమానుల సమస్యలను పరిష్కరించే దిశగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఒకవేళ రైతు ఆధార్ నంబరు వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదైతే సవరణ చేసుకోవడం సులభం. ఇకపై వెబ్‌ల్యాండ్‌లో సవరణ కోసం జేసీ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ సవరణ చేసే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించనుంది ప్రభుత్వం. తహసీల్దార్లే భూకేటాయింపు, సేకరణ, కోర్టు ఉత్తర్వుల అమలు వంటి బాధ్యతలు చూసుకుంటారు. ఆర్డీవోలకు రీ సర్వే పూర్తయిన తర్వాత గ్రామాల్లో …
Read More »ఎచ్చెర్ల జనసేన శ్రేణులతో ఎమ్మెల్సీ నాగబాబు ముఖాముఖి
ఎచ్చెర్ల,ఐఏషియ న్యూస్: శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన శ్రేణులతో సోమవారం ముఖాముఖి మాట్లాడారు.ఎచ్చెర్ల నియోజకవర్గం పిఓసీ ఎస్.విశ్వక్ సేన్ అధ్యక్షతన ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, జనసేన బలోపేతం కోసం సమష్టిగా పనిచేయాలని నాగబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలోఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు,మండల అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »రెండోవిడత ల్యాండ్ పూలింగ్ పై త్రిసభ్య కమిటీ సమావేశం
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి,ఐఏషియ న్యూస్: అమరావతికేంద్రంగాకీలకనిర్ణయాలుజరగుతున్నాయిరైతుల సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రెండో విడత లాండ్ పూలింగ్ కు నిర్ణయం తరువాత త్రిసభ కమిటీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. రైతుల పెండింగ్ అంశాల పరిష్కారం పైన కసరత్తు చేస్తోంది. అటు అమరావతిలో లాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. లాండ్ పూలింగ్ కు ముందుకు రాని రైతుల విషయంలో ఏం చేయాలనే అంశం పైన శనివారం త్రిసభ్య కమిటీ చర్చించింది. కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో రైతుల సమస్యల …
Read More »15లోగా రేషన్ స్మార్ట్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు రూ 200 చెల్లించాలి
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు,రేషన్ పంపిణీలో నూతన సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తోంది.క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ రేషన్ కార్డులను ఉచితంగా గత కొద్ది నెలల నుంచి పంపిణీ చేస్తోంది. అయితే కొంతమంది ఈ కార్డులను ఇంకాతీసుకోలేదు. ఆగస్టు నుంచి కార్డులను ఏపీ ప్రభుత్వం ఇస్తుండగా ఇప్పటికీ చాలామంది తీసుకోలేదు. కేవలం వృద్దులు, వికలాంగులకు మాత్రమే రేషన్ డీలర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్లి ఇస్తున్నారు.ఇప్పటికీ …
Read More »ప్రభుత్వ వైద్య కళాశాలలుప్రైవేటీకరణ జరగకుండా చర్యలు తీసుకోవాలి
అమరావతి,ఐఏషియ న్యూస్: ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు నిర్వహిస్తోంది. కోటి సంతకాల సేకరణతో ఈ నెల 18న మాజీ సీఎం జగన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానం సరైనదిగా వాదిస్తోంది. కాగా, ఈ సమయంలో వైసీపీ మెడికల్ కాలేజీల అంశాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లింది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ తమ ఆందోళన వివరించే ప్రయత్నం చేస్తోంది.ఏపీలో …
Read More »తెలంగాణలో “మహిళల ఉచిత బస్సు” ప్రయాణానికి రెండేళ్లు పూర్తి
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమై నేటికి (డిసెంబర్ 9) సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. 2023 డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం మహిళా సాధికారతకు గొప్ప మార్గంగా నిలిచింది. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అనుహ్య స్పందనను దక్కించుకుంది. తొలి రోజుల్లో …
Read More »కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్: ఒక్కో సంఘానికి 15 వేలు
అమరావతి,ఐఏషియ న్యూస్: నూతనంగా ఏర్పాటయిన డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను ప్రకటించింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు రూ.15 వేల చొప్పున అందించనున్నారు.ఈ మొత్తాన్ని ఆయా సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘం ఖాతాలోనే నిల్వ ఉంటుంది.సంఘం నిధి పెంచేందుకు,సభ్యుల అవసరానికి అనుగుణంగా అంతర్గతంగా అప్పులు మంజూరు చేసుకునేందుకు, బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో సంఘానికి రుణం మంజూరయ్యేందుకు రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుంది. త్వరలో సంఘాల ఖాతాల్లో నిర్దేశిత …
Read More »జమిలి ఎన్నికల బిల్లుకు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం లేదు
జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తెలిపిన లా కమిషన్ న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఒక దేశం- ఒకేసారి ఎన్నికలు’ లక్ష్యంతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవేశపెడుతున్న బిల్లులకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం లేదని లా కమిషన్,సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి తెలిపింది.ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ఏమీ ప్రయత్నించడం లేదని పేర్కొంది. సమాఖ్య నిర్మాణానికి భంగకరమయ్యేలా రాజ్యాంగ నిబంధనల్నీ మార్చడం లేదని స్పష్టం చేసింది. ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే పలు వర్గాలతో చర్చించిన జేపీసీ.. గురువారం లా కమిషన్‌తో కూడా …
Read More »డల్లాస్ లో పర్యటించిన నారా లోకేష్
తెలుగు డయాస్పోరాకు ప్రభుత్వం అండ డల్లాస్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు ఎన్.ఆర్.ఐలనుద్దేశించి ప్రసంగించారు. కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో వేలాది మంది తెలుగు ప్రవాసుల సమక్షంలో లోకేష్ మాట్లాడుతూ, కష్టకాలంలో తమకు అండగా నిలబడిన తెలుగు డయాస్పోరాకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రవాస భారతీయులను (ఎన్.ఆర్.ఐలను) ప్రశంసిస్తూ వారిని “మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్” గా అభివర్ణించారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా …
Read More »
News Website (iasianews.net) I Asia News