ప్రభుత్వ వైద్య కళాశాలలుప్రైవేటీకరణ జరగకుండా చర్యలు తీసుకోవాలి

అమరావతి,ఐఏషియ న్యూస్: ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు నిర్వహిస్తోంది. కోటి సంతకాల సేకరణతో ఈ నెల 18న మాజీ సీఎం జగన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానం సరైనదిగా వాదిస్తోంది. కాగా, ఈ సమయంలో వైసీపీ మెడికల్ కాలేజీల అంశాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లింది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ తమ ఆందోళన వివరించే ప్రయత్నం చేస్తోంది.ఏపీలో మెడికల్ కాలేజీల అంశం పైన వైసీపీ పోరు తీవ్రతరం చేసింది. ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ సంతకాల సేకరణ చేసింది. ఈ నెల 18న గవర్నర్ వద్దకు కోటి సంతకాలతో మాజీ సీఎం జగన్ వెళ్లి కలిసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాగా, తాజాగా వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.ప్రైవేటీకరణ జరగకుండా చర్యలు తీసుకో వాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలే సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థల కు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీనివల్ల పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్య అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *