
అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ.ఒక్కఓటు తేడాతో విజయం సాధించిన కోడలు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేద.అయితే నిజానికి ఆ ఓటు కూడా ఎంతో విలువైనది.డబ్బుల పరంగా కూడా.ఎన్నికలలో నిలబడిన కోడలి కోసం ఆమె మామ అమెరికా నుండి వచ్చి మరీ ఓటు వేశాడు కాబట్టి.సర్పంచ్ ఎన్నికలలోప్రతీ ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ.
ఒక్క ఓటే కదా అని నిజంగా వదిలేసి ఉంటే ఈరోజు పరిస్థితి వేరుగా ఉండేది .తనకోడలు ముత్యాల శ్రీవేద పంచాయితీ ఎన్నికల్లో సర్పంచి పదవికి పోటీ చేస్తోందని అమెరికా నుండి 4 రోజుల ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి.ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో 426 ఓట్లకు గాను 378 పోలవ్వగా శ్రీవేదకు వచ్చిన 189ఓట్లురాగా ఆమె ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చాలా లేదు.ఈ నేపద్యంలో ఒక్క ఓటు తేడాతో శ్రీ వేద సర్పంచ్ గా గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.చూసారా ఒక్క ఓటు ఆమెను సర్పంచ్ గా గౌరవమైన పదవి కట్టబెట్టింది.నేను రాకపోతే ఏంటి ఎన్నికల ఆగిపోతాయా అనుకుని ఆమె మామ అమెరికా నుండి రాకపోతే శ్రీ వేద ఓడిపోయి ఉండేది.
ఓటు వేయడం హక్కు.. మనబాధ్యత
ఇంటిపక్కనే ఎన్నికల పోలింగ్ బూత్ ఉన్నాకూడ ఓటువేయడానికి బద్దకించే అర్బన్ ఎడ్యుకేటెడ్ అజ్ఞానులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి.ఓటు విలువ తెలుసుకోండి. రాజ్యాంగబద్ధంగా మనకు సంక్రమించిన ఓటును వినియోగించుకోండి సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకొనే అవకాశం పొందండి.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News