Politics

రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాలి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ డిమాండ్ విజయనగరం,ఐఏషియ న్యూస్: గురజాడ స్ఫూర్తి ని ప్రజల్లోకి తీసుకు వెళతాం పాత్రి కేయుల సమావేశంలో భోగస్ ఓట్ల విషయంలో రాహుల్ గాంధీచేసిన ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలి లేదంటే ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. సోమవారం అయినా విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోగస్ ఓట్లు గురించి ఎన్నికల అధికారులకు మాత్రం రాహుల్ సమాధానం చెప్పడం లేదని,ఎన్నికల సమయంలో హడావిడిగా లేని విషయాన్ని ఉన్నట్లుగా చూపించడానికి …

Read More »

ఒడిశా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఒడిస్సా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది. బంగారం మైనింగ్ కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం శరవేగంగా పనులను నిర్వహించినట్లుగా సమాచారం. ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారతదేశంకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పొచ్చు.త్వరలోనే గనులు వేలం నిర్వహించి తవ్వకాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. Authored by: Vaddadi udayakumar

Read More »

ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం

విజయవాడ,ఐఏషియ న్యూస్: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో శుక్రవారం ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన సతీమణి సమీరా నజీర్ తో కలిసి ఇచ్చిన తేనీటి విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన సతీమణి గుడియా ఠాకూర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్,డీజీపీ …

Read More »

అట్టహాసంగా ప్రారంభమైన “స్త్రీ శక్తి” ఉచిత బస్ పథకం

ఆర్డినరీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్,లోకేష్,పివిఎన్ మాధవ్ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ మరో ఎన్నికల హామీ నిలబెట్టుకుంది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ శుక్రవారం స్త్రీ శక్తి పథకానికి అంకురార్పణ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో సిటీ ఆర్డినరీ బస్సులోకి ఎక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి ప్రయాణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.ఏపీలో ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి నారా …

Read More »

ఆరవసారి “రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకం” సాధించిన తెలుగుబిడ్డ సందీప్ చక్రవర్తి

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ జీ.వి. సందీప్ చక్రవర్తి. ఆరోసారి రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకం (పిఎంజి) అందుకుని అరుదైన ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధికసార్లు ఈ పతకం పొందిన కొద్దిమంది అగ్ర ఐపీఎస్ అధికారులలో ఆయన ఒకరిగా నిలిచారు. జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆయన చూపించిన అపారమైన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ పతకం లభించింది. ప్రస్తుతం ఆయన శ్రీనగర్ ఎస్ఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ నేపథ్యం, విశేషాలు.. …

Read More »

ప్రజలపై తుపాకి ఎక్కుపెట్టిన శత్రువులు ఎంతటివారైనా వదిలిపెట్టం…

ఎర్రకోటపై జాతీయ పతాక ఆవిష్కరణలో ప్రధాని మోడీ ఉద్వేగ ప్రసంగం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:  యావత్ దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు,అధికారులు,ఈ కార్యక్రమాలకు …

Read More »

వాడపల్లిలో (దేశ)భక్తులపై బ్రిటిష్ వారి కాల్పులు

(వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కోనసీమ తిరుమలగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత అందరికి తెలిసిందే. అయితే ఈ తరం వారికి తెలియని ఇంకో ముఖ్యమైన చరిత్ర ఇక్కడ దాగి ఉంది. అదేంటంటే ఇక్కడ దైవ భక్తులతో పాటు దేశ భక్తులు పుష్కలంగా ఉన్నారు. స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన రోజులవి.ఈ ఊరు చిన్నదైనా అక్కడ నేల పొరల్లో దశాబ్దాల క్రితం త్యాగాల్ని నాటారు. రక్తాన్ని ధారపోశారు. ఈ త్యాగాలు ఆ పల్లె కోసం …

Read More »

కోదండరాం, ఆలింఖాన్ ఎమ్మెల్సీ పదవులు రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ ఎమ్మెల్సీలు గా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకం రద్దు చేస్తూ సుప్రీం తీర్పువెలువరించింది. తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడి ఉంటుందనివెల్లడించింది. తమ నియామకం చేపట్టకుండా ఈ ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించటంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీనిపైన హైకోర్టు,సుప్రీం కోర్టుల్లో సుదీర్ఘ విచారణ జరిగింది. కాగా, బుధవారం కోదండరాం, ఆలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకం రద్దు చేస్తూ తుది తీర్పు కోసం …

Read More »

మట్టిలో దాగున్న బంగారు నిధి..మన దేశంలోని 5 పెద్ద బంగారు గనులివే

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్:  మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. భూగర్భ శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా కష్టపడి చేసిన పరిశోధనల తర్వాత ఈ అరుదైన విషయాన్ని ధృవీకరించారు.ఈ కొత్త ఆవిష్కరణ మధ్యప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, మన దేశంలో ఇంకా చాలా చోట్ల ఇలాంటి బంగారు నిధులున్నాయి.ఆ విశేషాలు, భారతదేశంలోని అతిపెద్ద ఐదు బంగారు గనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ హట్టి గోల్డ్ మైన్స్ భారతదేశంలోనే …

Read More »

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి బాలకృష్ణ భూమిపూజ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తుళ్లూరు సమీపంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృతశ్రేణిఆంకాలజీసేవలుఅందిస్తారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, రోగుల సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌ను అమలు చేస్తారు. రెండో దశలో పడకల …

Read More »