న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి,ఇండియా బ్లాక్ కు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని భారీ మెజారిటీతో ఓడించారు. ఈ విషయాన్ని పార్లమెంట్ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. మొత్తం 452 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఆయనకు ఓటు వేశారు. ఈ నెల 12వ తేదీన అంటే శుక్రవారం నాడు రాధాకృష్ణన్ …
Read More »Politics
విజయవాడలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ: 25వేలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్
విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈనెల 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో మహిళలు సంతోషంగా ఉన్నా ఈ పథకం ప్రభావం ఆటో డ్రైవర్లపై తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్లుతమను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉచిత బస్సు పథకం నేపథ్యంలో తమకు కొత్తపథకం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ మంగళవారం విజయవాడలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ చేపట్టారు.బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు …
Read More »మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు
అమరావతి,ఐఏషియ న్యూస్: నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం పై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు.బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.రియల్ టైమ్ గవర్నెన్స్ వేదిక గా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు.సంబంధిత మంత్రులు,శాఖల అధికారులతో సమన్వయం చేయనున్న మంత్రి నారా లోకేష్.సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రత్యేక …
Read More »Shri C.P.Radhakrishnan ji is elected as New Vice President of India
Chandrapuram Ponnusamy C. P. Radhakrishnan was elected as the 15th Vice President of India on 9th September 2025, succeeding Jagdeep Dhankhar who had resigned earlier that year citing health concerns. Representing the National Democratic Alliance (NDA), Radhakrishnan secured a robust victory with 452 first-preference votes—approximately 60.10% of the total—defeating the INDIA bloc’s candidate, former Supreme Court judge B. Sudershan Reddy, who obtained 300 …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాం
అమరావతి,ఐఏషియ న్యూస్: వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరు ఎమ్మెల్యేల మాదిరిగానే మాట్లాడేందుకు సమయం ఇస్తామన్నారు.రాష్ట్రంలోని సమస్యలతో పాటు తమతమ నియోజకవర్గాల్లోని ప్రజలకు సంబంధించి అన్ని ఇష్యూలపై చర్చించేందుకు టైం ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని, ప్రభుత్వానికి సహకరించాలన్నారు.స్పీకర్ అయ్యన్న సూచనలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. Authored by: Vaddadi udayakumar
Read More »ఇక ప్రతిరోజు తిరుపతి షిరిడి మధ్య ప్రత్యేక రైలు
తిరుపతి,ఐఏషియ న్యూస్: తిరుపతి- షిర్డీ మధ్య ఇకపై ప్రతిరోజూ రైలు నడవనుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి- షిర్డీ మధ్య 07637/07638 నంబర్ రైలును ఇకపై ప్రతి రోజూ నడపనున్నట్లు వెల్లడించింది. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా ఈ రైలు షిర్డీ చేరుకోనుంది. తిరుపతి టూ షిర్డీ మధ్య రైలు నడపాలని ఇటీవల సీఎం చంద్రబాబు …
Read More »నేడు ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక నేడు జరగనున్నది. పార్లమెంట్ సభ్యులు 15వ ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో దేశరాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్డీఏ- ఇండియా బ్లాక్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడకే. అయినప్పటికీ మెజారిటీని మరింత పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలో దిగారు. ఆయనపై సుప్రీంకోర్టు మాజీ …
Read More »ఉపరాష్ట్రపతి ఎన్నికపై మంత్రి లోకేష్ టిడిపి ఎంపీలతో సమావేశం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంగళవారం జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో టిడిపికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »సీడాప్ ద్వారా 5 ఏళ్లలో 50వేల మందికి విదేశీ ఉద్యోగాలు లక్ష్యం
అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై దృష్టిసారించామని, సీడాప్ ద్వారా రాబోయే అయిదేళ్లలో ఇతర దేశాల్లో 50వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్ ), ఇండో యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం (నర్సింగ్ ప్రొఫెషనల్స్) కింద …
Read More »రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్, చైనా పర్యటనల అనంతరం జరుగుతున్న భేటీ కావడంతో విదేశీ పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలు, భారత్ పై సుంకాలు విధింపు.. తదితర అంశాలనూ ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే …
Read More »