విదేశీ టెక్ నిపుణులను అమెరికాకు స్వాగతిస్తామన్న ట్రంప్ వాషింగ్టన్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: వలసల విషయంలో తన కఠిన వైఖరికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని టెక్నాలజీ పరిశ్రమల అభివృద్ధికి విదేశీ నిపుణుల అవసరం ఎంతోఉందని,అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకు వేలాది మందిని ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధమైన వలసలను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని తెలిపారు. వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో ట్రంప్ మాట్లాడుతూ.. “అరిజోనాలో బిలియన్ల డాలర్ల పెట్టుబడితో భారీ కంప్యూటర్ చిప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, …
Read More »Politics
తమ “కుటుంబానికి” ఇప్పటికీ “ప్రాణహాని” ఉంది
కుప్పం,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: తమ కుటుంబానికి ఇప్పటికి ముప్పు ఉందని సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఫ్యామిలీకి ఇంకా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ప్రజలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భువనేశ్వరి …
Read More »తెలంగాణ రాష్ట్ర పంచాయితీ ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా పంచాయితీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్ఈసీ, షెడ్యూల్ ప్రకటించింది.గురువారం నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాను సవరించాలని నిర్ణయించింది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల తప్పుల సవరణ 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం 23న తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు …
Read More »బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్
అమరావతి,ఐఏషియ న్యూస్: బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ గురువారం హాజరు కానున్నారు.బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇరువురు నేతలకు ఆహ్వానం అందింది.విజయవాడ నుంచి గురువారం ఉదయం 8 గంటలకు పాట్నాకు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉదయం 10.20 నిముషాలకు పాట్నాలోని గాంధీ మైదాన్ లో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న ఇరువురు …
Read More »సచిన్ టెండూల్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి లోకేష్
పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: భగవాన్ సత్య సాయిబాబా సెంటినరీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సచిన్ ను కలిసిన వారిలో మంత్రి లోకేష్ తో పాటు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఉన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »భాగస్వామ్య సదస్సు సక్సెస్ పై సీఎం చంద్రబాబు జిల్లా అధికారులకు అభినందనలు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: భాగస్వామ్య సదస్సు నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సమాచార శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీసీసీ ఎండీ కల్పనా కుమారిలను అభినందిస్తూ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడువీరికి జ్ఞాపికలు అందజేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆత్మీయ వీడ్కోలు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ జిల్లాలో సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్-2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ తో కలిసి,ఉండవల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లాకు తిరుగు పయనమయ్యారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు శనివారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు పలికారు.ముఖ్యమంత్రికి విశాఖ ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికిన వారిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్,ప్రభుత్వ విప్ గణబాబు, శాసనసభ్యులు పల్లా …
Read More »కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు ఘన స్వాగతం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ పరిశీలనకు విచ్చేసిన కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్రకి,అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ కి పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, బిజెపి పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ గొర్లె రాము నాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, జనసేన, టీడీపీ, బిజెపి నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు, కూటమి నాయకులు హాజరైనారు. …
Read More »బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలు 25 యేళ్ల మైథిలీ ఠాకూర్
పాట్నా,ఐఏషియ న్యూస్: ఆధ్యాత్మిక, జానపద గీతాలను ఆలపిస్తూ మైథిలీ ఠాకూర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. బీహార్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు. మైథిలీ ఠాకూర్ అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆమె ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఇక ఫేస్‌బుక్‌లో అయితే 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మైథిలీ …
Read More »డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వ రెండవ వార్షికోత్సవం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు.ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8 వ తేదీన రెండవ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధికి సాధించాలన్న లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని వచ్చే డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ …
Read More »
News Website (iasianews.net) I Asia News