తెలంగాణ రాష్ట్ర పంచాయితీ ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా పంచాయితీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్ఈసీ, షెడ్యూల్ ప్రకటించింది.గురువారం నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాను సవరించాలని నిర్ణయించింది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల తప్పుల సవరణ 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం 23న తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *