Politics

భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ నియామకం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ ను ప్రకటించారు. ఇరుదేశాల మధ్య టారిఫ్లకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్హౌస్లో పర్సనల్ డైరెక్టర్ గా ఉన్నారు.త్వరలోనే బాధ్యతలు చేపడతారు. Authored by: Vaddadi udayakumar

Read More »

సెప్టెంబర్ 8 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సారథ్యం శోభాయాత్ర విజయవంతం చేయాలి

బిజెపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు సుజాతనగర్(విశాఖపట్నం,ఆంధ్రప్రదేశ్),ఐఏషియ న్యూస్: అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో సెప్టెంబర్ 8న జరగబోయే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ “సారథ్యం శోభాయాత్ర” విజయవంతం చెయ్యాలని కోరుతూ పెందుర్తి బిజెపి నాయకులు,జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, బిజెపి 95,97వ వార్డుల అధ్యక్షులు చిక్కాల సతీష్ ల ఆధ్వర్యంలో బిజెపి 95,97వ వార్డుల పదాధికారులు,బిజెపి కార్యకర్తలు,అభిమానులతో ముఖ్య సమావేశం చినముషీడివాడలో శనివారం నాడు జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు …

Read More »

అనారోగ్యంతో సిపిఐ మాజీ ఎంపీ సురవరం మృతి

హైదరాబాద్,ఐఏషియ న్యూస్:  కమ్యూనిస్టు ఉద్యమానికి అపారమైన సేవలందించిన సీపీఐ జాతీయ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి గురువారం రాత్రి నుంచి విషమించగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సురవరం మహబూబ్‌నగర్‌ (పాలమూరు) జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. …

Read More »

టిడిపి మద్దతు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కే

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు రాజకీయాలు చేయడం తగదు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ను కలసిన సీఎం చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతి ఎన్నిక గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశరాజధానిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్డీఏ- ఇండియా బ్లాక్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడకే. ఆరోగ్య కారణాల దృష్ట్యా ధన్ ఖర్ కిందటి నెలలో తన పదవికి రాజీనామా చేసిన …

Read More »

గుంతలు పడిన రోడ్లపై టోల్ వసూలు చేయకూడదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:గుంతలు పడిన, డ్రైవింగ్ చేయడానికి అనువుగా లేని, ట్రాఫిక్ జామ్ అయిన రహదారులపై వాహనాదారులను టోల్ చెల్లించాలని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. త్రిస్సూర్ జిల్లాలోని పలియక్కర ప్లాజా వద్ద టోల్ వసూలును నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎస్హెచ్ఏఐ), టోల్ వసూల్ సంస్థ దాఖలు …

Read More »

ఏపీ క్యాబినెట్ లో 33 నిర్ణయాలు ఆమోదం

సచివాలయాల్లో 2,778 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్  ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీ రాజధాని అమరావతిలో గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ ముందుకు వచ్చిన పలు ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించి ఆమోదముద్ర వేశారు. కేబినెట్ నిర్ణయాల్లో అమరావతి రాజధానిలో భూకేటాయింపులు, సచివాలయాల్లో ఖాళీల భర్తీ, అధికార భాష సంఘం పేరు మార్పు వంటి పలు అంశాలు ఉన్నాయి.ఇవాళ ఏపీ కేబినెట్ మొత్తం 33 నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఇందులో అమరావతిలోని 29 …

Read More »

ఆంధ్రప్రదేశ్లో రెండు కొత్త ఎయిర్ పోర్ట్ లకు క్యాబినెట్ ఆమోదం

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో కొత్త విమానాశ్రయాలపై చర్చించారు.కుప్పం, దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు విమానాశ్రయాలను పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్) విధానంలో అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన ముయిసాదా ఆర్‌ఎఫ్‌పీని కేబినెట్ ఆమోదించింది. భూసేకరణ, యుటిలిటీల బదిలీ కోసం హడ్కో నుండి రుణం తీసుకుంటారు. విమానాశ్రయానికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. దీనికి మౌలిక …

Read More »

జైల్లో ఉన్న ప్రధాని,సీఎం,మంత్రుల తొలగింపు బిల్లుపై అమిత్ షా వివరణ

న్యూఢిల్లీ, ఐఏషియ న్యూస్: జైల్లో ఉన్నవారు ప్రధాని, సీఎం, మంత్రులుగా కొనసాగకుండా కేంద్రం కొత్త బిల్లు తీసుకువచ్చిన సంగతి విదితమే. అయితే ఈ బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హెూంమంత్రి అమిత్ షా ఈ కొత్తబిల్లుపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో నైతిక విలువలను పునరుద్ధరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బిల్లు తెచ్చిందని స్పష్టం చేశారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు వంటి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో కొనసాగకుండా …

Read More »

ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యం తిరుమ‌ల కొండ పైవ‌ర‌కు పొడిగింపు

ఆర్టీసీ చైర్మన్ కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు తిరుమల,ఐఏషియ న్యూస్: ఏపీలో ‘స్త్రీశ‌క్తి’ పేరుతో ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యంఈనెల 15 నుంచి ప్రారంభించింది.ఈ ప‌థకానికి అపూర్వ స్పంద‌న వ‌స్తుంద‌న్న ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మ‌న్ కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకుఇప్పుడు తిరుమ‌ల కొండ‌ పైవర‌కు కూడా ఈ సౌక‌ర్యం వ‌ర్తింపు చేశారు.అయితే ఘాట్ రోడ్డు కార‌ణంగా సిటింగ్ వ‌ర‌కే అనుమ‌తి ఇచ్చామని ఆర్టీసీ చైర్మన్ కొన‌క‌ళ్ల నారాయణరావు వెల్లడించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ముఖ్యమంత్రి అయిన ఉపేక్షించేది లేదు: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి,ఐఏషియ న్యూస్: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై దాడులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్‌గా స్పందించారు.అటవీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశారన్నారు. అంతేకాకుండా, వారిని వాహనాల్లో బంధించి, రాత్రంతా రెండు గంటల పాటు శ్రీశైలం …

Read More »